ట్విట్టర్ ద్వారా తన మాటల్ని చెబుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి తన ట్వీట్స్ తో ఏపీ సర్కారుకు విజ్ఞప్తి చేశారు. ఏపీ రాజధాని అమరావతిలో భూసేకరణ విషయంలో ఏపీ అధికారపక్షం అనుసరిస్తున్న భూసేకరణపై తన అభ్యంతరాన్ని తెలుపుతూ ఈ మధ్యన ట్వీట్స్ చేయటం తెలిసిందే.
ఈ మధ్యన చేసిన విధంగానే ట్వీట్స్ చేసిన ఆయన.. ఈసారి భూసేకరణ చేపట్టొద్దని కోరిన గ్రామాల్నికూడా పేర్కొనటం గమనార్హం. ఏడాదికి మూడు పంటలు పండే రైతుల భూములు లొక్కోవద్దని.. భూసేకరణ విషయంపై చంద్రబాబు సర్కారు మరోసారి ఆలోచించాలని కోరారు.
పాలకులు రైతలు పట్ల వివేచనతో మెలగాలని కోరిన పవన్ కల్యాణ్.. అభివృద్ధి కోసం జరిగే నష్టం ఎంత తక్కువగా ఉంటే.. ఆ పాలకులు అంత వివేకవంతులుగా ఉంటారని పేర్కొన్నారు.
అభివృద్ధి చేస్తూనే.. వాతావరణ సమతుల్యత.. పర్యావరణాన్ని కాపాడాలని సూచించిన పవన్ కల్యాణ్.. తన తాజా ట్వీట్స్ లో బేతపూడి.. ఉండవల్లి.. పెనుమాకతోపాటు.. కృష్ణా నదికి సమీపంలో ఉన్న గ్రామాలను భూసేకరణ నుంచి మినహాయించాలని కోరారు. ఇప్పటివరకూ భూసేకరణ విషయంలో వద్దని మాత్రమే చెప్పిన పవన్.. తాజాగా ఊరి పేర్లను కూడా ప్రస్తావించిన నేపథ్యంలో.. ఏపీ సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి.