రెండో విడత వారాహియాత్రలో భాగంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా లోని ఏలూరు లో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏపీ లో మానవ అక్రమ రవాణా ఎక్కువగా సాగుతుందని వ్యాఖ్యానించారు! ఈ సందర్భంగా వాలంటీర్ల పై పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయని తెలుస్తుంది.
అవును.. ఏలూరు సభలో ప్రసంగించిన పవన్ ఆంధ్రప్రదేశ్ లో మానవ అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతోందని.. గత నాలుగేళ్లలో 30,000 మంది అమ్మాయిలు అపహరణ కు గురయ్యారని.. వారిలో 14వేల మంది మాత్రమే దొరికారని.. మిగిలిన వారి జాడ లేదని నేషనల్ క్రైం రికార్డ్స్ లో ఉందని పవన్ చెప్పుకొచ్చారు.
ఇదే సమయంలో "ఏపీ లోని ప్రతీ గ్రామ వాలంటీరు.. ఈ పార్టీలో, ఈ గ్రామం లో, ఎన్ని ఇళ్లు ఉన్నాయి, వాటి లో ఎంతమంది ఉంటున్నారు అనే విషయాలు తెలుసుకుంటూ ముఖ్యంగా ఒంటరిగా ఉన్న మహిళల ను వీళ్లు టార్గెట్ చేసి, ఆ ఇన్ ఫర్మేషన్ కొంతమంది సంఘవిద్రోహ శక్తుల కు ఇస్తే.. వాళ్లు వీరిని కిడ్నాప్ చేయడం కానీ, ట్రాప్ చేయడం కానీ ఇంతమంది మిస్సయిపోయారు. ఇలా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది.. దీని లో చాలా మంది వైసీపీ పెద్దల హస్తం ఉంది" అని అన్నారు.
అయితే ఈ విషయాలు తనకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయని.. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ లోని ప్రజల కు, యువత కు, మహిళల కు చెప్పమని తనకు చెప్పాయని.. అందుకే తాను ఈ విషయాన్ని చెబుతున్నానని అన్నారు. ఇలా ఏపీ లో మానవ అక్రమ రవాణా.. దీనికి వాలంటీర్లు ఇస్తున్న సమాచారమే కారణం అని పవన్ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయని అంటున్నారు. ఈ కామెంట్ల పై వాలంటీర్లు తీవ్ర స్థాయి లో ఫైరవుతున్నారని తెలుస్తుంది.
దీంతో... # #PawanKalyanSaySorryToVolunteers అనే హ్యాష్ ట్యాగ్ తో తమ పై పవన్ కల్యాణ్ చేసిన నిరాధార ఆరోపణలు చేసినందుకు సోషల్ మీడియా వేదీకగా వాలంటీర్లు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది! ఇదే సమయం లో మరికొంతమంది పవన్ పై మీంస్, ట్రోల్స్ చేస్తూ తమ నిరసన ను తెలియపరుస్తున్నారని అంటున్నారు.
ఇదే సమయం లో... వాలంటీర్ల వ్యవస్థ పై విమర్శలు చేసుంటే హుందాగా ఉండేదని, అలాకాకుండా వాలంటీర్ల పై వ్యక్తిగతంగా ఆరోపణలు చేసి చవకబారు రాజకీయాలకు తెరతీశారని పలువురు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా.. వ్యవస్థల పై హుందాగా స్పందించకుండా... సామాన్య చిరుద్యోగులైన వాలంటీర్లను లక్ష్యం చేసుకోవడం ఎంతవరకూ సమంజసమనే ప్రశ్నలు వినిపిస్తున్నాయని తెలుస్తుంది.
అదేవిధంగా... వాలంటీర్ల మనోభావాల్ని పవన్ కళ్యాణ్ ఘోరంగా అవమానించారని రాజకీయ విశ్లేషకులు తప్పుబడుతున్నారని తెలుస్తుంది. ప్రభుత్వం పై కోపముంటే, వ్యతిరేకత ఉంటే ముఖ్యమంత్రి జగన్ లేదా మంత్రులు లేదా వాలంటీర్ వ్యవస్థను విమర్శించుకోవాలి గానీ..ఇలా వాలంటీర్ల వ్యక్తిత్వాన్ని హననం చేసే వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని వారు అభిప్రాయపడుతున్నారని అంటున్నారు.
అదేవిధంగా... ఏపీ లోని కొంతమంది వాలంటీర్లలో జనసేన కార్యకర్తలు కూడా ఉన్నారనే విషయం పవన్ మరిచిపోయి వ్యాఖ్యానించారని ఇంకొంతమంది వాలంటీర్లు ఫీలవుతున్నారని అంటున్నారు. ఏది ఏమైనా... వాలంటీర్ల పై పవన్ చేసిన వ్యక్తిగత విమర్శలు ఏపీ రాజకీయాల్లో పెనుదుమారమే రేపబోతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!