జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో తన దూకుడును పెంచుతున్నారు. ఇప్పటికే పార్టీకి చెందిన నాయకులను ఎంపిక చేయడం ద్వారా జోరును పెంచిన పవర్ స్టార్ తాజాగా మరో కీలక విభాగానికి శ్రీకారం చుట్టారు. జనసేన సేవాదళ్ ను పార్టీ అధ్యకుడు పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారు. సేవాదళ్ కేంద్ర కమిటీ ఆవిర్భావ సమావేశం హైదరాబాద్ లోని జనసేన పరిపాలన కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి వరకు తన పార్టీ విస్తరణ ప్రణాళికలను పవన్ వివరించారు.
జనసేనా సేవాదళ్ ప్రారంభించిన సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాడానికి సేవాదళ్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సేవాదళ్ నియమావళిని ఈ సందర్భంగా విడుదల చేస్తూ పది అంశాలతో కూడిన ఈ నియమావళిని సేవాదళ్ లోని ప్రతి కార్యకర్త పాటించాలని పవన్ కోరారు. రానున్న కొద్ది రోజులలో సేవాదళ్ ను విస్తృత పరుస్తామని చెప్పారు. తొలుత జిల్లాస్థాయిలో వందమంది కార్యకర్తలతో సేవాదళ్ సేవలు ప్రారంభం అవుతాయని ప్రకటించారు. ఆ తరువాత మండల, గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు.