ప‌వ‌న్ పొలిటిక‌ల్ ఫిలాస‌ఫీ విన్నారా?

Update: 2019-01-26 08:11 GMT
ఇవాల్టి రోజున ఎవ‌రి ఫిలాస‌ఫీ వారిది. ఎవ‌రు డ‌ప్పు వారు వాయించండ్రా అంటూ మ‌హా ఊపుతో అదేదో సినిమాలో అన్న‌ట్లే.. ఎవ‌రి రాజ‌కీయ పార్టీ వారిది. ఎవ‌రి సిద్దాంతాలు వారివి. అన్నింట్లోనూ క‌స్ట‌మైజేష‌న్ వ‌చ్చిన‌ప్పుడు రాజ‌కీయాల్లోకి కూడా ఎందుకు రాకూడదు?

అలాంటి వాటిని తెచ్చేందుకు ప‌వ‌న్ లాంటోళ్లు ఉంటారుగా. తాజాగా త‌న పార్టీలోకి వ‌చ్చే వారు ఎలా ఉండాలంటూ చెప్పే క్ర‌మంలో అనుకోకుండా ప‌వ‌న్ క‌ల్యాణ్ మాష్టారు త‌న పొలిటిక‌ల్ ఫిలాస‌ఫీ గురించి చెప్పుకొచ్చారు. దాని ప్ర‌కారం.. జ‌న‌సేన పార్టీలోకి అవినీతిప‌రులు వ‌చ్చినా త‌న‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌న్నారు.

ఏంది.. ప‌వ‌న్ క‌ల్యాణ్ సారు వారు ఇలా చెప్పారా? అని అవాక్కు అవ్వాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఎందుకంటే అలానే చెప్పారు మ‌రి. అయితే.. అవినీతిప‌రుల్ని పార్టీలో చోటు ఉంద‌ని చెబుతూనే.. అలాంటి అవినీతిప‌రులైన‌రాజ‌కీయ నేత‌ల‌కు ఉండాల్సిన లక్ష‌ణం గురించి కాసింత వెరైటీగా చెప్పుకొచ్చారు. అవినీతిప‌రులైన వ్య‌క్తులు పార్టీలోకి వ‌చ్చినా.. వారు దోచుకున్న‌దంతా ప్ర‌జ‌ల‌కు పంచిపెట్టే సంస్కార‌వంతులు కావాల‌ని ఆశిస్తాన‌ని చెప్పారు.

చాలా సంద‌ర్భాల్లో ప‌వ‌న్ సారు చెప్పే మాట‌లు లాజిక్కుకు ఏ మాత్రం అంద‌వు. దోచుకునేవాడు దాచుకుంటాడు కానీ.. దోచిందంతా ప్ర‌జ‌ల‌కు పంచిపెట్టే గుణం ఎందుకు ఉంటుంది?  ఒక‌వేళ ఆ గుణం ఉంద‌నే అనుకుందాం?  అలాంటోడు అస‌లు దోచుకోవాల‌ని ఎందుకు అనుకుంటాడు?  ఏందో ప‌వ‌న్ సారు.. మీ నోట్లో నుంచి విన్న‌ప్పుడు మాత్రం భ‌లే చెప్పాడ‌నిపిస్తుంది కానీ.. కాస్తంత తీరిగ్గా కూర్చొని లాజ్కికులు గ‌ట్రా లాంటి వాటిలో సింక్ కాకుండా తెగ ఇబ్బంది పెట్టేస్తుంటాయ్. ఇలా అయితే ఎలా ప‌వ‌న్ జీ?  లాజిక్కుల‌కు చిక్కేలా మీ త‌త్త్వం ఉండ‌దా?
Tags:    

Similar News