ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన పార్టీ, బీజేపీ తమ వ్యూహ, ప్రతివ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా పోటీ చేసే అవకాశముందని భావిస్తున్న వైఎస్సార్సీపీ నేతలు ప్రతిపక్ష నేతలపై తీవ్ర విమర్శలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విమర్శలతో విరుచుకుపడుతున్నారు.
వైఎస్సార్సీపీ నేతలకు ధీటుగా ఏమాత్రం తగ్గకుండా జనసేనాని పవన్ కల్యాణ్ కూడా వారిని ఏకిపారేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ విధానాలను తూర్పూరబడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా పవన్ పవర్‌ఫుల్ సెటైర్లతో జగన్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇందుకు జనంలోకి సులువుగా వెళ్లిపోయే కార్టూన్లను ఆయన తన విమర్శలకు ఎంచుకుంటున్నారు. ఇప్పటికే వివిధ అంశాలపై పవన్ కల్యాణ్ కార్టూన్ల రూపంలో జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలను సంధించిన సంగతి తెలిసిందే.
తాజాగానూ పవన్ మరో పవర్‌ఫుల్ కార్టూన్‌తో జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ప్రభుత్వం నవరత్న పథకాల్లో భాగంగా ప్రతిష్టాత్మకంగా పేదలందరికీ ఇళ్లు అనే స్కీమ్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 35 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి.. ఇంటి నిర్మాణానికి సహకరించాలనేదే ఈ స్కీమ్. ఇందులో భాగంగా పట్టణాల్లో అయితే సెంటు స్థలం, గ్రామాల్లో అయితే సెంటున్నర స్థలం ప్రభుత్వం మంజూరు చేసింది.
అయితే ప్రభుత్వం పేదలకు ఇస్తున్న ఈ ఇళ్ల స్థలాలను పేదలు ఇల్లు కట్టుకులేక అమ్మేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ స్థలాలను రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ఇతర వ్యక్తులు కొనుగోలు చేస్తున్నారని.. దీంతో ప్రభుత్వ ఆశయం నెరవేరడం లేదని మీడియా పేర్కొంది. ఈ నేపథ్యంలో దీన్ని లక్ష్యంగా చేసుకుని జనసేనాని పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా పవర్‌ఫుల్ సెటైర్ వేశారు.
పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో పేర్కొన్న కార్టూన్ ప్రకారం.. జగనన్న ఇల్లో.. జగనన్న ఇల్లు.. తక్కువ ధరలకే చౌక బేరం అంటూ నిక్కరు వేసుకున్న వ్యక్తి నడుచుకుంటూ రోడ్డు మీద అరుచుకుంటూ వెళ్తుంటాడు. అతడి భుజంపై ఉన్న మూటలో ఇళ్లు ఉంటాయి. ఇళ్ల నుంచి బయటకు వచ్చిన వారు అతడిని ఆసక్తిగా గమనిస్తుంటారు. పట్టించుకునేవారు లేక యథేచ్ఛగా జగనన్న ఇల్లు అమ్మకం అంటూ ఆ కార్టూన్ లో పేర్కొనడం విశేషం.
ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలం ఇచ్చినా ఇంటి నిర్మాణ వ్యయం తదితరాలు పెరిగిపోవడంతో పేదలు ఇళ్లు నిర్మించలేకపోతున్నారని.. దీంతో వారు ఆ స్థలాలను అమ్మేసుకుంటున్నారని పవన్ తన కార్టూన్‌లో ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.