ఒక్క ట్వీట్ తో పవన్ పరువు పాయె !

Update: 2022-06-06 06:49 GMT
తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి సీన్ లోకి వ‌చ్చారు. ట్విట‌ర్ వేదిక‌గా కొన్ని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. దీంతో ప‌వ‌న్ ప‌రువు తీసిపారేశారు.  
 
పొత్తుల‌కు సంబంధించి టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య వార్ నడుస్తోంది. ఈ నేప‌థ్యంలో గోరంట్ల ఒక్క ట్వీట్ తో ప‌వ‌న్ ప‌రువు మొత్తం తీసిప‌డేశారు అన్న  అభిప్రాయం వ‌స్తోంది. ఆ విధంగా ఆయ‌న వాడిన భాష ఉంది. పొత్తుల‌కు సంబంధించి మొత్తం 3 ఆప్ష‌న్లు తెర‌పైకి జ‌న‌సేన తెచ్చిన నాటి నుంచి త‌గువు రేగుతూనే ఉంది.

ఈ ద‌శ‌లో టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్ గోరంట్ల జోక్యం చేసుకుని క్వింటా వ‌డ్లు తూగాలంటే ఒక్కోసారి కొన్ని వ‌డ్లు అవ‌స‌రం అవుతాయి.. ఆ పాటిదానికే కాటా తూగింద‌ని అనుకుంటే ఎలా ? అని ప‌వ‌న్ పేరు వాడకుండానే సేనాధిపతి అంటూ పవన్ కు ఝ‌ల‌క్ ఇస్తూ ట్వీట్ చేశారు. దీంతో ఇప్పుడు టీడీపీకి, జ‌న‌సేన‌కూ మ‌ధ్య మాట‌ల యుద్ధం షురూ అయింది.

వాస్త‌వానికి 2014 లో  పొత్తు ధ‌ర్మంలో భాగంగా మ‌ద్ద‌తిచ్చిన జ‌న‌సేన మ‌ళ్లీ ఇప్పుడు అదే ఈక్వేష‌న్ రిపీట్ చేయాలంటే కొంత త‌ర్జ‌న‌భ‌ర్జ‌న పడుతోంది. త్యాగం మేం కాదు ఈసారి మీరు కూడా చేయాలి అని అంటోంది. ఓ మెట్టు త‌గ్గాల్సి వ‌స్తే అవ‌త‌లి పార్టీ వారు త‌గ్గాల్సిందేన‌న్న సంకేతాలు ఇచ్చింది. దాంతో ప‌వ‌న్ వ్యాఖ్య‌లు మ‌రింత మంట‌లు రాజేశాయి. నిన్న‌టి నుంచి సోష‌ల్ మీడియా ద‌ద్ద‌రిల్లిపోతోంది. జ‌న‌సేన మాత్రం ఉమ్మ‌డి సీఎం అభ్య‌ర్థిగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ప్ర‌క‌టిస్తేనే తామంతా ఎలాంటి పొత్తుకు అయినా ఒప్పుకుంటామ‌ని అంటోంది.

ఇక తెలుగుదేశంలో కూడా కొంత అంత‌ర్మ‌థ‌నం మొద‌ల‌యింది. తాము పొత్తుల గురించి ఇంకా మాట్లాడ‌కుండానే ప‌వ‌న్ ఆప్ష‌న్లు ఇస్తున్నార‌ని, ఇదెంత మాత్రం భావ్యం కాద‌ని కొంద‌రు సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు అంటున్నారు.

త‌మ వ‌ల్లే ఆ రోజు గెలిచామ‌న్న భావ‌న జ‌న‌సేన‌కు ఉండడం వ‌ల్ల‌నే అప్ప‌ట్లో విప‌క్షం నుంచి కూడా ఇబ్బందులు ఎదుర‌య్యాయ‌ని అంటున్నారు. అప్ప‌ట్లో టీడీపీని ఉద్దేశించి వైసీపీ చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌ను ప్ర‌స్తావిస్తున్నారు. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ జ‌న‌సేన ఇచ్చిన ఆప్ష‌న్ల‌లో తాము ఎటు ఉండేది ? ఎలా నెగ్గేది ? అన్న‌ది ఇంకా ఆలోచిస్తున్నామ‌ని ఇంకొంద‌రు అంటున్నారు. ఎవరికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నా,రాష్ట్ర ప్రజలకు ఏకైక ఆప్షన్ టీడీపీనే అని కూడా అంటోంది.
Tags:    

Similar News