సీఎం జగన్ కు థ్యాంక్స్ చెప్పిన పవన్..

Update: 2021-01-24 15:25 GMT
నిన్నటి దాకా ‘జగన్ రెడ్డి’ అంటూ ఏపీ సీఎం సామాజికవర్గాన్ని టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ఆయనపై ప్రశంసలు కరిపించారు. నిన్ననే జనసేన కార్యకర్తకు వైసీపీ ఎమ్మెల్యే, సీఎం జగన్ ధోరణి అంటూ నిప్పులు చెరిగిన పవన్ అదే నోటితో జగన్ పై పొగడ్తల వర్షం కురిపించడం విశేషం.

తూర్పు గోదావరి జిల్లా కొత్తపాకల గ్రామంలో దివీస్ పరిశ్రమ నిర్మాణాన్ని స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై పవన్ కూడా అక్కడికి వెళ్లి మరీ నిరసన తెలిపారు. దివీస్ నిర్మాణాన్ని ఆపకపోతే వదిలిపెట్టే ప్రసక్తే లేదని నినదించారు. గ్రామస్థులు సైతం ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు గ్రామస్థులను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.

తాజాగా అరెస్ట్ చేసిన వారిని విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ విషయమై లేఖను విడుదల చేశారు.

‘దివీస్ కర్మాగారంతో చుట్టుపక్కల గ్రామాలన్నీ ఇబ్బంది పడుతున్నాయని.. వారి సమస్యలను సైతం జగన్ పరిష్కరించాలని కోరారు. దివీస్ నిరసనకారులను ప్రభుత్వం విడుదల చేయడం సంతోషం కలిగించిందన్నారు. ఈ సందర్భంగా హైకోర్టుకు, సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ఇటీవల దివీస్ కాలుష్యంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేయగా.. 36మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. దీంతో గ్రామస్థుల్లో భయాందోళన వ్యక్తమైంది. అరెస్ట్ అయిన వారికి బెయిల్ రావడానికి సహకరించిన అందరికీ జనసేన తరుఫున పవన్ కృతజ్ఞతలు తెలిపారు. వారిపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరారు.




Tags:    

Similar News