భీమవరం నుంచే పవన్...చెప్పేశారు...!

Update: 2023-07-01 09:25 GMT
పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో భీమవరం నుంచే పోటీ చేయబోతున్నారు. ఆ సంగతిని ఆయన చెప్పేసారు. అది కూడా చెప్పకనే చెప్పేసారు. తన నేల భీమవరం అన్నారు. తాను అక్కడే ఉంటాను అన్నారు. పాతికేళ్ల పాటు కూలీగా పనిచేస్తాను అని కూడా అన్నారు. అంటే భీమవరం నుంచి మరో అయిదు ఎన్నికల వరకూ పవన్ సొంత నియోజకవర్గంగా భావించి పోటీ చేసి గెలుస్తూ ఉంటారని అర్ధం చేసుకోవాలన్న మాట.

అంతే కాదు ఆయన మరో మాట అన్నారు. తాను ఈసారి తప్పకుండా గెలవగలను అని అంటున్నారు. తన గెలుపును ఎవరూ ఆపలేరు అని అన్నారు. అంటే భీమవరంలో పవన్ పోటీ చేయడం ఖాయమే అని అంటున్నారు పవన్ వారాహీ యాత్ర మొత్తం పదిహేడు రోజుల పాటు గోదావరి జిల్లాలలో సాగింది.

అయితే పవన్ భీమవరంలోనే ఎక్కువ రోజులు గడిపారు. అక్కడ స్థానికంగా సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఓడినా భీమవరమే తన గడ్డ అన్నారు. నిజానికి తనకు ఓటమి ఫీలింగ్ భీమవరం ఇవ్వలేదని చెప్పారు.

ఎపుడూ కూడా వేలాదిగా జనాలు వచ్చి తనకు స్వాగతం పలుకుతూనే ఉన్నారని, వారి అభిమానంతో తాను గెలుపు ఓటములు అన్న వాటిని లెక్కపెట్టుకోవడం లేదని కూడా అన్నారు.

మరో వైపు చూస్తే భీమవరం నుంచి పోటీ అని పవన్ ప్రకటన కచ్చితంగా ఉంటుందని అంతా ఊహించారు. కానీ పవన్ ఇండైరెక్ట్ గానే చెప్పేసి వెళ్లారని అంటున్నారు. భీమవరంలో పవన్ పోటీ చేయడం ఖాయమని మాజీ మంత్రి చేగొండి హరి రామజోగయ్య కొద్ది రోజుల క్రితమే చెప్పారు దాంతో అందరిలో ఉత్కంఠ అయితే ఉంది.

కానీ పవన్ మాత్రం ఎందుకో ఆ సస్పెన్స్ ని మరి కొన్నాళ్ళ పాటు కొనసాగించాలని చూస్తున్నారు అని అంటున్నారు. అదే సమయంలో హింట్ ఇచ్చి ఊరుకున్నారు. భీమవరంలో పవన్ పోటీ చేయడానికి కారణం స్థానికంగా ఉన్న వారు అంతా ఆయన్నే బరిలో నిలబడమని కోరుతున్నారు దాంతో పవన్ భీమవరాన్ని ఎంచుకున్నారని తెలుస్తోంది.

Similar News