దత్తపుత్రుడు ఇది క్యాచీ పదంగా మారింది ఏపీ రాజకీయాల్లో తమకు నచ్చని వారికి దీనిని ఎంచక్కా తగిలించి పారేస్తున్నారు. చంద్రబాబు దత్తపుత్రుడు అని పవన్ కళ్యాణ్ణి వైసీపీ నేతలు ఒక్క లెక్కన విమర్శిస్తూ వచ్చారు. ఇక ఒక దశలో ఇది పొలిటికల్ ర్యాగింగ్ గా కూడా మారింది. దానికి చెక్ చెప్పేలా పవన్ ఆ మధ్య అనంతపురం టూర్లో ఏకంగా జగన్ కే అల్టిమేటం ఇచ్చేశారు. మరోసారి నన్ను దత్తపుత్రుడు అని అంటే నేను మిమ్మల్ని సీబీఐ దత్తపుత్రుడు అని అనాల్సి ఉంటుందని కూడా సుతిమెత్తగా చెప్పేశారు.
సరే ఆ తరువాత కూడా ఒంగోలు మీటింగులో జగన్ దత్తపుత్రుడు పవన్ అన్న పదాన్ని వాడారు. దాంతో గోదావరి జిల్లాల టూర్లో పవన్ సీబీఐ దత్తపుత్రుడు జగన్ అని డిక్లేర్ చేసి మరీ సభలో అఫీషియల్ గా వాడేశారు. ఆ తరువాత పవన్ టూర్లు లేవు. అయితే ప్రెస్ నోట్లు ఆయన రిలీజ్ చేస్తున్నా ఎక్కడా సీబీఐ దత్తపుత్రుడు అని మాత్రం అనలేదు. ఒక విధంగా పవన్ ఈ విషయంలో బ్యాలన్స్ గానే వెళ్తున్నారు అనుకోవాలి.
అటు వైపు జగన్ చూస్తే విశాఖ టూర్లో దుష్ట చతుష్టయం అని చంద్రబాబుని కొన్ని టీడీపీ అనుకూల చానళ్ళను మాత్రమే విమర్శించి ఊరుకున్నారు. తప్పితే ఎక్కడా పవన్ ప్రస్థావన మాత్రం తేలేదు. అది ఈ మధ్య కాలంలో విశేష పరిణామంగానే చూడాలి. దాంతో ఈ దత్తపుత్రుడు వివాదానికి బ్రేక్ పడుతుందని అంతా అనుకున్నారు. కానీ జనసేనలో నంబర్ టూ గా ఉన్న నాదెండ్ల మనోహర్ మాత్రం ఈ దత్తపుత్రుడు పదాన్ని అసలు వదలడంలేదు.
ఆయన ఇప్పటికి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పలు ప్రెస్ నోట్లు రిలీజ్ చేశారు. ప్రతీ దాంట్లో కూడా సీబీఐ దత్తపుత్రుడు జగన్ అని ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఒక విధంగా వైసీపీని కెలకడం స్టార్ట్ చేశారన్న మాట. మరి దీని మీద మళ్లీ వైసీపీ మంత్రులు, నాయకులు రెచ్చిపోతే ఈ దత్తపుత్రుడు అగ్గి రాజుకుంటూనే ఉంటుంది. ఇక్కడ ఒక మాట చెప్పాలి. నాదెండ్ల సీబీఐ దత్తపుత్రుడు జగన్ అని అంటున్నారు. జగన్ మీద సీబీఐ కేసులు చాలానే ఉన్నాయన్న సంగతి జనాలకు తెలియదా. ఆయన పదహారు నెలలు జైలులో ఉన్నారని కూడా తెలియదా.
అవన్నీ అయిన తరువాతనే కదా సీఎం అయింది. అంటే ఆ ఆరోపణల వల్ల జగన్ కి పొలిటికల్ గా వచ్చిన నష్టం అయితే ఏదీ లేదనుకోవాలి. అదే టైమ్ లో పవన్ని చంద్రబాబు దత్తపుత్రుడు అని పదే పదే వైసీపీ ప్రచారం చేస్తే అది ఆయనకు భారీ నష్టం కదా. పైగా జనసేన సెల్ఫ్ ఐడెంటిటీనే టార్గెట్ చేసే విమర్శ కదా. మరి ఈ దత్తపుత్రుడి వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఆతృత ఆరాటం అటూ ఇటూ ఉండాలి. ఒక వైపు సైలెంట్ అయినపుడు రెండవ వైపు కెలకడం ద్వారా నాదెండ్ల నిజంగా జనసేనానికి మేలు చేస్తున్నారా లేదా అటు కెలికి ఇటు నాలుగు అనిపిస్తున్నారా అన్నదే చర్చ. మొత్తానికి ఈ మాజీ స్పీకర్ క్లాస్ పాలిటిక్స్ మాస్ పార్టీకి చిక్కులు తెచ్చేలా ఉన్నాయంటే ఆలోచించాలేమో కదా.