ఏపీలో చకచకా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. నిన్నటిదాకా వేరు వేరు అనుకున్న పార్టీలు ఇపుడు ఒక్కటిగా చేతులు కలుపుతున్నాయి. ఏపీ రాజకీయాలను మార్చేసే గేమ్ చేంజర్ గా ఉన్న జనసేన తెలుగుదేశం పార్టీతో సన్నిహితంగా ఉండడం అంటే అది అత్యంత కీలకమైన రాజకీయ పరిణామంగా చూడాలనే అంటున్నారు. ఇప్పటిదాకా జనసేన ఈ విషయంలో ఎక్కడా బయటపడకున్నా ఫస్ట్ టైం పవన్ పనిగట్టుకుని మరీ చంద్రబాబు ఇంటికి తన కారుని పోనీయడం అంటే ఈ రెండు పార్టీలు పొత్తుల దిశగా ప్రయాణం చేస్తున్నాయని అంతా భావిస్తున్నారు.
అయితే కేవలం మర్యాదపూర్వక భేటీ అని పవన్ కళ్యాణ్ అనంతరం మీడియాకు చెప్పారు. చంద్రబాబు హక్కులను కుప్పంలో వైసీపీ ప్రభుత్వం కాలరాయడం పట్ల తాను ఆవేదన చెంది ఆయనను పరామర్శించడానికి అని చెప్పారు. ఏపీ సర్కార్ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాల మీద ఏ విధంగా పోరాటం చేయాలి అన్నది కూడా చర్చించామని అన్నారు. ఆ సంగతి అలా ఉంచితే రెండు పార్టీలు జగన్ని ఉమ్మడి ప్రత్యర్ధిగా చేసుకుని చేతులు కలిపాయన్నది క్లారిటీ వచ్చేసింది.
దాంతో ఇపుడు వైసీపీ శిబిరంలో కలవరం రేగుతోంది. బాబు పవన్ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకొవడంతో వైసీపీ క్యాంప్ ఫుల్ షేక్ అవుతోంది అని అంటున్నారు. పవన్ ఇలా చంద్రబాబుతో భేటీకి వెళ్లారో లేదో వరసబెట్టి వైసీపీ మంత్రులు దాని మీద కామెంట్ చేయడం బట్టి చూస్తే వైసీపీకి ఈ కొత్త ఎత్తు పొత్తుల ఫీవర్ బాగానే ఉంది అని అంటున్నారు.
ఈ రెండు పార్టీలు కలిస్తే వ్యతిరేక ఓటు చీలకుండా ఉంటే కనుక అది కచ్చితంగా వైసీపీకి దెబ్బ అవుతుందని అనేక సర్వేలు నిరూపించిన నేపధ్యం ఉంది. 2014లో అది నిజం అయిన పరిస్థితి ఉంది. అందుకే వైసీపీలో ఇపుడు పెద్ద ఎత్తున రాజకీయ అలజడి రేగుతోంది. పవన్ బాబు భేటీ మీద మంత్రి గుడివాడ అమరనాధ్ అయితే సంక్రాంతికి ముందే మామూళ్ళ కోసం దత్త తండ్రి ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ వెళ్లారు అని సెటైర్లు వేశారు. గంగిరెద్దుల వాళ్ళు సంక్రాంతి కి ఇంటి ముందుకు వస్తారని, అలా డూడూ బసవన్న మాదిరిగా బాబు చెప్పేదానికి తల ఊపుకుంటూ పవన్ భేటీకి వెళ్ళారని ఎకసెక్కం చేశారు.
జనసేన తెలుగుదేశం రెండు ఎపుడో కలసి ఉన్యాని ఇపుడు బయటపడ్డాయని మరో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు పట్టని ఈ ఇద్దరు తమ సొంత రాజకీయం కోసమే చేతులు కలిపారని అన్నారు. ఈ రెండు పార్టీల పొత్తు అపవిత్రమైనది అని అప్రజాస్వామికమని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. మొత్తానికి చూస్తే పొత్తుల విషయంలో మాత్రం రెండు పార్టీలు ఏమి మాట్లాడుకున్నాయన్నది తెలియకపోయినా వైసీపీలో మాత్రం వేడి బాగా పెరిగింది అని అంటున్నారు.
నిజానికి రాజకీయాల్లో పొత్తులు సాధారణమైనవి. అవి తప్పు కూడా కాదు. ప్రతీ ఎన్నికలోనూ పొత్తులు పెట్టుకునే పార్టీలు చాలా కనిపిస్తాయి. కానీ ఏపీలో మాత్రం జనసేన టీడీపీ పొత్తు పట్ల వైసీపీ చేస్తున్న విమర్శలు పెడుతున్న అభ్యంతరాలు చూస్తే కచ్చితంగా ఆ పార్టీకి ఏదో బెంగ బెదురు పట్టుకుందా అన్న డౌట్ అయితే కలగకమాందు. ఏది ఏమైనా బాబు పవన్ భేటీ వైసీపీ కి నోటి నిండా చేతి నిండా పని కల్పించింది అని అంటున్నారు.