ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై... జనసేనాని పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో విమర్శలు సంధిస్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడు ఏపీకి వచ్చినా.. లేకుంటే.. హైదరాబాద్‌లో అయినా.. పవన్.. ఏపీ ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడుతున్నారు. అయితే.. తాజాగా ఆయన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవల చేసిన విమర్శలను అస్త్రాలుగా చేసుకుని వైసీపీ సర్కారుపై ధ్వజమెత్తారు.
ఏపీ ప్రభుత్వ అప్పులపై ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యల వీడియోను తన ట్వీట్ కు జత చేసిన పవన్ కళ్యాణ్.. A snippet of Sri 'Undavalli Arun Kumar ji's press meet on the disastrous financial situation of AP & how the AP Govt lacks transparency in Governance. అని పేర్కొన్నారు. అంటే.. ‘ఉండవల్లి'గారి లాంటి రాజకీయ ఉద్ధండులు ఈ మాట మాట్లాడుతున్నారంటే పరిస్థితి తీవ్రత అర్ధం చేసుకోవచ్చు." అంటూ ముగించారు. తద్వారా ఏపీ ఆర్ధిక పరిస్ధితి ఎలా ఉందనే దానిపై పవన్ కళ్యాణ్ నేరుగానే స్పందించినట్లయింది. ఇప్పటి వరకు ఏపీ సర్కార్ అప్పులపై ఎక్కువగా మాట్లాడని పవన్ కళ్యాణ్.. తాజాగా ఉండవల్లిని కోట్ చేస్తూ చేసిన ట్వీట్ ఆసక్తిగా మారింది.
ఉండవల్లి ఏమన్నారంటే..
ఇంతకీ మాజీ ఎంపీ ఉండవల్లి ఏమన్నారనేది చూస్తే.. వైఎస్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఉండవల్లి అరుణ్‌కుమార్ ఇటీవల కాలంలో తరచుగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆయన వైసీపీ సర్కార్ అప్పుల్ని ఆయన టార్గెట్ చేశారు. ఉండవల్లి లేవనెత్తిన అంశాలు ఇతర రాజకీయ పార్టీల్ని సైతం ఆలోచనలో పడేశాయి. ఏపీ ఆర్ధిక పరిస్ధితి అస్తవ్యస్తంగా ఉందని, అయినా వైసీపీ సర్కార్ ఇష్టానుసారంగా అప్పులు చేస్తోందని అన్నారు. సర్కార్ ఇప్పటి వరకూ 6 లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. ఇంత మంది సలహాదారుల్ని పెట్టుకుని మరీ ఇలాంటి దయనీయ పరిస్ధితులు రావడం బాధాకరమని ఉండవల్లి వ్యాఖ్యానించారు.
ఇంత జరుగుతున్నా ప్రభుత్వ సలహాదారులు ఏం చేస్తున్నారని ఉండవల్లి ప్రశ్నించారు. ఇవే పరిస్ధితులు కొనసాగితే రాష్ట్రానికి గడ్డు పరిస్ధితులు తప్పవన్నారు. అమరావతిని తాకట్టు పెట్టి మరీ అప్పులు తెచ్చే పరిస్ధితికి వైసీపీ ప్రభుత్వం దిగజారిందని ఉండవల్లి ఆక్షేపించారు. ఎక్కడ పడితే అక్కడ అప్పులు తెచ్చే రాష్ట్రంగా ఆంద్రప్రదేశ్ మారిపోయిందని ఆయన ఆరోపించారు. వైసీపీ సర్కార్ ఏపీ ఎస్డీపీతో పాటు ఇతరత్రా సంస్ధల ద్వారా అప్పుల కోసం చేస్తున్నప్రయత్నాలను ఉద్దేశించి ఉండవల్లి ఈ ఆరోపణలు చేశారు. అయితే ఉండవల్లి ప్రస్తావించిన అమరావతి తాకట్టు అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ ప్రభుత్వ అప్పులు, అమరావతి తాకట్టు, సలహాదారులు వంటి అంశాలపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతన్న నేపథ్యంలో దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఉండవల్లి కామెంట్స్ వీడియోను కోట్ చేస్తూ ఓ ట్వీట్ కూడా చేశారు. తద్వారా వైసీపీ ప్రభుత్వంపై ఉండవల్లి కామెంట్స్ ను పవన్ కళ్యాణ్ సమర్ధించినట్లయింది. అదే సమయంలో ఈ ట్వీట్ ద్వారా వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ మరోసారి విమర్శల దాడి మొదలుపెట్టినట్లయింది. దీనిపై వైసీపీ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. అయితే.. ఉండవల్లి.. అనేక సార్లు ప్రభుత్వంపై విమర్శలు చేసినా.. ఎవరూ ఈ రేంజ్‌లో ఆయనను వెనుకేసుకు వచ్చి.. ఆయన వ్యాఖ్యలను తిరిగి రీట్వీట్ చేసిన సందర్భాలు లేవు. సో.. మొత్తానికి ఉండవల్లి కామెంట్లను పవన్ అందిపుచ్చుకుని చెలరేగిపోయారన్న మాట.