జ‌ససేనానికి జ‌న నీరాజం.. ప్ర‌కాశం జిల్లాలో ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న ప్రారంభం

Update: 2022-06-19 11:29 GMT
జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ జోరు పెంచారు. వ‌రుస ప‌ర్య‌ట‌న‌ల‌తో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ఇప్ప‌టికే జ‌న‌సేన కౌలు రైతు భ‌రోసా యాత్ర పేరుతో ప‌శ్చిమ గోదావ‌రి, క‌ర్నూలు, అనంత‌పురం జిల్లాల్లో ప‌వ‌న్ ప‌ర్య‌టించారు. ఆ జిల్లాల్లో పంట‌లు పండ‌క‌, పండించిన పంట‌కు గిట్టుబాటు ధ‌ర రాక ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డ కౌలు రైతుల కుటుంబాల‌కు ల‌క్ష రూపాయ‌ల చొప్పున ప‌వ‌న్ ఆర్థిక సాయం చేశారు. ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డ కౌలు రైతులు రాష్ట్ర‌వ్యాప్తంగా 3000 మంది ఉంటార‌ని స‌మాచార హ‌క్కు చ‌ట్టం నివేదిక‌లే తెలుపుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ప‌శ్చిమ గోదావ‌రి, క‌ర్నూలు, అనంత‌పురం జిల్లాల్లో కౌలు రైతుల కుటుంబాల‌ను ఆదుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న త‌దుప‌రి ప‌ర్య‌ట‌న‌ను ప్ర‌కాశం జిల్లాలో ప్రారంభించారు. జూన్ 19న ఆదివారం ప్ర‌కాశం జిల్లా ప‌ర్చూరులో జ‌రిగే కౌలు రైతు భ‌రోసా యాత్ర‌కు ప‌వ‌న్ కారులో బ‌య‌లుదేరారు. మ‌రోవైపు ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌భ‌కు ప్ర‌జ‌లెవ‌రూ వెళ్ల‌కుండా జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆటంకాలు క‌ల్పిస్తోంది. ఇప్ప‌టికే ప‌లువురికి పోలీసుల‌తో చేత నోటీసులు ఇప్పించింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌భ‌కు వెళ్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రిస్తోంది.

కాగా కారులో లాల్ పురం, ఏటుకూరు, యుద్ధ‌న‌పూడి, చిల‌క‌లూరిపేట‌ ప్రాంతాల మీదుగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ర్చూరుకు బ‌య‌లుదేరారు. జ‌న‌సేనానికి జ‌న నీరాజం ప‌లికారు. పూల దండ‌లు, భారీ క్రేన్ ల‌ను ర‌ప్పించి గ‌జ‌మాల‌ల‌తో ఎదురేగి స్వాగ‌తం ప‌లికారు. దారి పొడ‌వునా త‌న‌ను చూడ‌టానికి వ‌చ్చిన ప్ర‌జ‌ల‌కు ప‌వ‌న్ కారుపైకి ఎక్కి ఆత్మీయ అభివంద‌నం చేశారు. జాతీయ జెండాను ఊపి ప్ర‌జ‌ల్లో ఉత్సాహం తెచ్చారు. ఓ వైపు భారీ వ‌ర్షం కురుస్తున్నా లెక్క చేయ‌కుండా ప్ర‌జ‌లు ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌కు వెల్లువ‌లా వ‌చ్చారు. వీరితో రోడ్ల‌న్నీ నిండిపోయాయి.

ప‌వ‌న్ త‌న ప‌ర్య‌ట‌నలో భాగంగా ప‌ర్చూరు నియోజ‌క‌వ‌ర్గం య‌న‌మ‌ద‌ల గ్రామంలో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డ పోల‌వ‌రపు వెంక‌టేశ్వ‌ర్లు కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. ఆయ‌న భార్య అనూష‌కు ల‌క్ష రూపాయ‌ల సాయాన్ని అందించారు. వారి బిడ్డలు వైష్ణ‌వి, శ్రీల‌క్ష్మిల చ‌దువులు తాను చూసుకుంటాన‌ని భ‌రోసా ఇచ్చారు. అలాగే డేగ‌ర‌మూడిలో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డ కౌలు రైతు నీలం ర‌వికుమార్ కుటుంబానికి ల‌క్ష రూపాయ‌ల ఆర్థిక సాయం చేశారు. వారి బిడ్డ‌ల‌కు జ‌న‌సేన పార్టీ అండ‌గా ఉంటుందాని భ‌రోసా ఇచ్చారు. ప‌ర్చూరులో జ‌రిగే జ‌నసేన కౌలురైతు భ‌రోసా యాత్ర‌లో ప‌వ‌న్ ప్ర‌సంగించ‌నున్నారు.
Tags:    

Similar News