మొత్తానికి అనుకున్నదే అయింది భీమవరం సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బ్లాస్ట్ అయ్యారు. ఏకంగా సీఎం జగన్ కే ఆయన వార్నింగ్ ఇచ్చేశారు. మిష్టర్ జగన్మోహన్ రెడ్డీ అంటూ చెవులు రిక్కించి బాగా విను. నేను చెప్పే ప్రతీ మాటా అంటూ పవన్ కళ్యాణ్ ఒక్క లెక్కన ఫైర్ అయ్యారు.
నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నావ్. నీ వ్యక్తిగత జీవితం నాకు క్షణక్షణం తెలుసు. టోటల్ గా తెలుసు. అది చెప్పలేనా అని పవన్ ఒక రేంజిలో సౌండ్ చేశారు. నీకు బాగా దగ్గర మనిషిని నా దగ్గరకు పంపిస్తే నీ వ్యక్తిగత విషయాలు ఒక్కోటీ చెబుతాను.
ఆ విన్న వ్యక్తికి చెవిలో నుంచి రక్తం కారకపోతే ఒట్టు అంటూ పవన్ స్ట్రాంగ్ కౌంటరేశారు. మాటిమాటిని నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం మానుకోవాలని పవన్ సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చేశారు. పనికి మాలిన మాటలు మాట్లాడుతారా అని మండిపడ్డారు.
ఇది కచ్చితంగా వార్నింగే అనుకోమన్నారు పవన్. నేను బలమైన పోరాటం మీ ప్రభుత్వంతో పార్టీతో చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని పవన్ అల్టిమేట్ గా తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే కురుపాం లో జరిగిన సభలో జగన్ పవన్ గురించి మాట్లాడిన మాటలకు ఇది గట్టి రిటార్ట్ అంటున్నారు.
నాలుగు పెళ్ళిళ్ళు చేసుకుంటాడు, పెళ్ళి అనే వ్యవస్థను నడి రోడ్డు మీదకు తెచ్చారు. పవన్ లా దిగజారి పోలేమని నాడు జగన్ స్పీచ్ ఇచ్చారు. అయితే దానికి ధీటైన తీరులో పవన్ రెస్పాండ్ అయ్యారు. నా వ్యక్తిగతం అసలు మీకు ఎందుకు అంటూ దూకుడుగానే ప్రశ్నించారు.
మీ సొంత విషయాలు మేమూ చెప్పగలమని కూడా హెచ్చరించారు ఒక విధంగా చూస్తే జగన్ పవన్ ల మధ్య జరుగుతున్న పొలిటికల్ వార్ లో ఇది మరో కీలకమైన టర్నింగ్ పాయింట్ గా చెప్పుకోవాలని అంటున్నారు. ఈ ఇద్దరు మధ్యన ఎపుడూ మాటల యుధ్ధమే సాగుతోంది. అది కాస్తా 2024 ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇంకా హీటెక్కిపోతోంది.
ఇద్దరూ ఒకే ఏజ్ వారు కావడం, ఇద్దరికీ ట్రెడిషనల్ పాలిటిక్స్ వంటబట్టకపోవడం దూకుడు స్వభావంతో ఉండడం వల్ల ఏపీ రాజకీయాల్లో ఎన్నడూ చూడని సరికొత్త సమరాన్నే చూస్తున్నారు అంతా. పవన్ కి జగన్ ఇచ్చిన కౌంటర్ కి భీమవరంలో ఆయన జవాబు ఉంటుందని అంతా ఊహించారు. దాన్ని ఏ మాతం నిరాశ పరచకుండా పవన్ లౌండ్ సౌండ్ తో భీమవరం జంక్షంలోనే మిష్టర్ జగన్ అంటూ బిగ్ సౌండే చేశారు.
తనకు సంక్సారం ఉందని, అందుకే తాను మీలా దిజరాను, చిల్లర మాటలు అంతకంటే అనను అని పవన్ చెప్పడం విశేషం. ఏది ఏమైనా దీనికి వైసీపీ వైపు నుంచి ఏ రకమైన రియాక్షన్ వస్తుందో. ఇప్పటిదాకా పవన్ జగన్ని ఎన్ని అన్నా వ్యక్తిగతంగా ఇంతలా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం హెచ్చరించడం జరగలేదు. మరి దీన్ని ఎలా ఆర్ధం చేసుకోవాలో అన్నది వేచి చూడాల్సిందే.