రాజకీయ నాయకుడి ఇంట్లో శవం లేచినా కూడా ప్రజల కంట్లో నలుసు పడితే ఆ బాధ అతి ముఖ్యం కావాలి. తన వారు ఎంతటి ఇబ్బందులో ఉన్నా తనను నమ్ముకున్న జనాలకు ఏ చిన్న ఆపద వచ్చినా తక్షణం వాలిపోయే స్వభావి కావాలి. అపుడే వారు ప్రజా నాయకుడు అని జనాలు నమ్ముతారు. రియల్ లీడర్ ఎపుడూ తన బాధను ప్రపంచ బాధ కావాలనుకోడు, ప్రపంచ బాధనే తన బాధగా చేసుకుంటారు.
ఏపీలో చూస్తే చిత్ర విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏడున్నర పదుల వయసు, అర్ధ శతాబ్దం నిండిన రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు సైతం తన బాధనే జనాలను చూడమంటున్నారు. నా భార్యను తిట్టారు, నా కుటుంబాన్ని అవమాన పరచారు అని బాబు ఆ మధ్యంతా అదే తడవుగా ఏకరువు పెట్టుకున్నారు. ఇపుడు బాబు కాస్తా రూటు మార్చారనుకోండి.
ఇక పవన్ విషయం తీసుకుంటే ఆయన ఎంతసేపూ తాను తన చదువు, తన తండ్రి పోలీస్ అని సొంత విషయాలు సభలలో చెబుతూ వస్తున్నారు. ఇపుడు ఏకంగా వారాహి యాత్రతో ఆయన తన భార్యను వైసీపీ వారు నిందిస్తున్నారు అంటూ వాపోతున్నారు. నన్ను అనేక రకాలుగా తిడుతున్నారు అని అంటున్నారు. తన మీద వైసీపీ వారు కక్ష కట్టారని అంటున్నారు. తాను అన్ని తిట్లూ భరిస్తున్నాను అని చెప్పుకుంటున్నారు.
నిజానికి సభకు వచ్చిన జనాలకు ఇవి అవసరమా అన్నది పవన్ ఆలోచించడంలేదు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం. జనాలకు వాటితో పనిలేదు. అందుకే వారు లైట్ తీసుకుంటారు. రాజకీయాల్లోకి వచ్చకా అన్నీ పడాలి అన్నది జనం చెప్పే థియరీ. ఇక పవన్ కళ్యాణ్ నా భార్య ఆవేదన చెందింది బాధపడింది. అయినా రాజకీయాల్లోకి వచ్చాను అని చెబితే జనాలు ఎందుకు సానుభూతి చూపిస్తారు.
ఆయన రాజకీయాల్లోకి వచ్చింది సేవ చేయడానికి, ఆ రూపేణా వచ్చే పదవులు ఏమైనా ఉంటే కూడా తీసుకోవడానికి.. ఇది పక్కా క్లారిటీగా జనాలకు తెలుసు. అందుకే వారు మా సంగతేంటో చెప్పు పవన్ అని అంటున్నారు. నిజంగా కొండంత బాధ తనకు ఉన్నా జనాల బాధనే సభలలో గట్టిగా చెబితే వినేందుకు జనాలు రెడీగా ఉంటారు కానీ పవన్ మాత్రం నా కుటుంబాన్ని అంటున్నారు. నాకు ప్రాణ హాని ఉంది. నాకు చావుకు భయంలేదు లేదు అంటూ పదే పదే ఎమోషనల్ డైలాగులు చెప్పడం వల్ల మొదట్లో కొంత ఆసక్తిని రేపినా చివరికి అవి రొటీన్ గా మారిపోతున్నాయని అంటున్నారు.
జనసేన అధినేతగా కాబోయే సీఎం గా పవన్ ఏపీ ప్రభుత్వ విధానాల మీద ఎన్ని అయినా విమర్శలు చేయవచ్చు అభివృద్ధి మీద డిబేట్ పెట్టవచ్చు. ఏపీలో తమ ప్రభుత్వం వస్తే ఏమి చేస్తామో చెప్పవచ్చు. కానీ అవన్నీ పక్కన పెట్టి అధికార పార్టీ మీద విమర్శలు చేయడం తన గురించి పదే పదే చెప్పుకోవడం ద్వారా ఏమి సాధిస్తారు అన్నదే ప్రశ్నగా ఉంది.
మొత్తం మీద చూస్తే పవన్ మీటింగులు అన్నీ రొటీన్ గా సాగుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. రెండు లక్షల పుస్తకాలు చదివిన పవన్ కి ప్రపంచ బాధ తన బాధగా మార్చుకోవడం ఎలాగో తెలుసు అనే అనుకుంటున్నారు. ఆ దిశగా సేనాని అడుగులు వేస్తే ఆయన రాజకీయం అనుకున్న దిశగా సాగుతుంది అని అంటున్నారు.