వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తా... పవన్ పవర్ ఫుల్ సవాల్

Update: 2022-11-27 09:32 GMT
వచ్చే ఎన్నికల్లో 175 కి 175 సీట్లు ఎలా రావో చూద్దామంటూ ఒక వైపు ముఖ్యమంత్రి జగన్ పార్టీ నేతలతో బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ ఎల గెలుస్తుందో చూస్తాను అంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ మరోసారి గెలిచే ప్రసక్తే లేదు ఇది తధ్యం, ఇదే సత్యం. ఇదే ఖాయమని కూడా ఆయన బిగ్ సౌండ్ చేస్తున్నారు.

ఆయన మంగళగిరి పార్టీ ఆఫీసులో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ మీద సంచలన కామెంట్స్ చేశారు. వైసీపీతో తానే యుద్ధం చేస్తాను అని చెప్పడం ద్వారా తాను ఒక్కడు చాలు ఎవరి సాయం అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ మధ్యనే మోడీతో పవన్ అరగంటకు పైగా విశాఖలో భేటీ వేశారు. ఆ సమావేశం వివరాలు బయటకు రాలేదు కానీ పవన్ మాత్రం అక్కడ ఏమి మాట్లాడుకున్నారో హింట్లు ఇస్తున్నారు.

ఈ మధ్యనే విజయనగరంలో పర్యటించిన పవన్ అక్కడ మాట్లాడుతూ ఢిల్లీకి  తన మీద చాడీలు చెబుతున్నారు అంటూ వైసీపీ మీద మండిపడ్డ సంగతి తెలిసిందే. ఆ విధంగా ఆయన అనగానే వైసీపీ నేతలు కూడా కౌంటరేశారు. మాకేమి పని పవన్ మీద నేరాలు చెప్పడానికి అని కూడా అన్నారు. తాము పవన్ గురించి రాజకీయంగా ఆలోచన కూడా చేయమని పేర్కొన్నారు.

ఇపుడు మరోసారి పవన్ అవే మాటలను అనడం ద్వారా తాను చెప్పే విషయంలో ఉన్న సీరియస్ నెస్ ని బయటపెట్టారు. తాను మీలాగా ఢిల్లీకి వెళ్ళీ చాడీలు చెప్పే రకం కాదని పవన్ అన్నారు. తాను ప్రధానికి ఎపుడు కలసినా దేశ భవిష్యత్తు, ప్రజల రక్షణ గురించే మాట్లాడుతానని చెప్పుకొచ్చారు. అలాగే వైసీపీని దెబ్బకొట్టాలీ అంటే అది ప్రధాని మోడీకి చెప్పి చేయనని కూడా ఆయన చెప్పడం విశేషం.

మరో వైపు ఆయన పవర్ ఫుల్ గా మాట్లాడారు  . తాను ఏమనుకున్నా ఒక్కడినే చేస్తాను అని తాను ఇక్కడ పుట్టిన వాడిని అని ఇక్కడే తేల్చుకుంటాను అని కూడా అన్నారు. తన యుద్ధం తానే చేస్తాను అని కూడా చెప్పుకున్నారు. మరి బీజేపీ విషయంలో పవన్ ఈ విధంగా అన్నారా లేక వైసీపీకి హెచ్చరికలు చేయడానికి అన్నారా అన్నది అయితే తెలియడంలేదు.

నా యుద్ధం నేనే చేస్తాను నేను ఇక్కడ పుట్టిన వాడిని అని ఆయన అనడం వెనక అసలు ఉద్దేశం ఏపీ రాజకీయాలను ఎక్కడో ఢిల్లీలో ఉన్న వారు శాసించలేరు, డైరెక్షన్లు ఇవ్వలేరు అని కూడా అర్ధం వస్తుందని అంటున్నారు. ఈ మధ్యనే పవన్ మోడీతో భేటీ తరువాత బీజేపీ డైరెక్షన్లో ఆయన పనిచేస్తారు అని ప్రచారం సాగుతోంది. వామపక్షాలు అయితే అదే మాటను అంటూ వస్తున్నాయి. ఇక వైసీపీ నేతలు ఈ భేటీ మీద డైరెక్ట్ గా మాట్లాడకపోయినా పవన్ మీద విమర్శలు చేస్తూనే ఉన్నాయి. టీడీపీ అయితే పవన్ వైఖరిని అనుమానంగా చూస్తోంది

మరి వీటన్నిటికీ ఒకే సమాధానం అన్నట్లుగా పవన్ ఈ విధంగా చెప్పారా అన్న చర్చ అయితే ఉంది. ఏది ఏమైనా పవన్ ఎవరితో ఎన్ని భేటీలు వేసినా ఒక్క విషయంలో మాత్రం ఆయన పక్కా క్లారిటీతో ఉన్నారు అని అర్ధమవుతోంది. అది వచ్చే ఎన్నికల్లో వైసీపీని తిరిగి అధికారంలోకి తీసుకురాకూడదు అన్న దాని మీద మాత్రం ఆయన కట్టుబడి ఉన్నారు.

ఈ పాయింట్ ఒక్కటి చాలు విపక్ష శిబిరం ఊపిరి తీసుకోవడానికి. అలాగే తెర వెనక మంత్రాంగాలు ఎవరు నడిపినా పవన్ తో పారవు అని కచ్చితంగా భావించడానికి కూడా ఆయన తాజాగా ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే అర్ధమవుతోంది అని అంటున్నారు. ఇవన్నీ సరే కానీ పని గట్టుకుని ఢిల్లీ వెళ్ళి మరీ పవన్ మీద మోడీకి చాడీలు చెబుతున్న వారు ఎవరు. ఇది తేలాల్సిన అవసరం అయితే ఉంది.
Tags:    

Similar News