పేటీఎం...స్మార్ట్ ఫోన్ వాడే వారికి ఎవరికీ ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు. ఎందుకంటే...పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈ యాప్ చాలా పాపులర్ అయిపోయింది. ప్రచారం చేసుకోవడంలో పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ పాపులర్. పేటీంఎ కరో పేరుతో ప్రచారం చేసుకోవడం కోసం ఆయన చేసిన ట్వీట్ సెల్ఫ్ గోల్ అవడమే కాదు..ఆయన్ను స్థాయిని ఘోరంగా దిగజార్చింది కూడా! ఇదంతా కేరళ ఫ్లడ్స్ విషయంలో. గతంలో వలే నవ్వుల పాలు అయ్యారు. దేవభూమిగా ఖ్యాతిగాంచిన కేరళలో ప్రకృతి సృష్టించిన విలయంతో కుండపోత వర్షాలతో కేరళ చిగురుటాకులా వణికిపోతోంది.
ఇంత భయంకరమైన ప్రకృతి విపత్తులో పేటీఎం ఓనర్ తన పేటీఎం తన ఉదారతను చాటుకోవడంలో కక్కుర్తి పడటంతో పాటు ప్రచారానికి తెరతీశారు. ``కేరళ బాధితుల సహాయం కోసం నేను పదివేల రూపాయలు విరాళం ఇచ్చాను. మీరు కూడా పేటీఎం యాప్ ఓపెన్ చేయండి. డబ్బులు విరాళంగా ఇవ్వండి``అంటూ ఆన్ లైన్ పేమెంట్ స్క్రీన్ షాట్ తో సహా ఆయన ఓ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు సెటైర్లు పేల్చారు. కొందరైతే శాపాలు కూడా పెట్టారు. `నీ సంస్థ ప్రచారం కోసం ప్రకృతి విపత్తును కూడా వదిలిపెట్టవా? ` అంటూ ఓ నెటిజన్ ఫైరయితే...``నువ్వు ఓ భిన్నమైన ఇబ్బందికరమైన మనిషివి. నీ పిల్లలు నిన్ను చూసి సిగ్గుపడతారని అనుకుంటున్నాను. ఇదే నేను నీకు చెప్పదలుచుకుంది.బై` అంటూ మండిపడ్డారు. కోట్లాదిపతిగా ఉన్న శర్మ...తన సంస్థకు ప్రచారం కల్పించుకునేందుకు కూడా రూ.10000 ఖర్చు చేశారంటే శర్మను అభినందించాల్సిందే అంటూ ఇంకొందరు సెటైర్లు వేశారు. అయితే మరికొందరు ఆయన్ను సమర్థించారు. మొబైల్ వ్యాలెట్ ద్వారా ఒక వ్యక్తి బదిలీ చేసేది కేవలం రూ.10,000 మాత్రమేనని ఈ విషయాన్ని తెలుసుకోవాలని కోరుతున్నారు.
కాగా, గతంలో కూడా విజయ్ శేఖర్ ఇలాగే నవ్వుల పాలైన సంగతి తెలిసిందే. `భారత సాయుధ దళాల ఫ్లాగ్ డే ఫండ్ కోసం ఇప్పుడే రూ. 501 నేను విరాళంగా ఇచ్చాను.` అంటూ శేఖర్ శర్మ ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్ కాస్త వైరల్ అయింది. శేఖర్ శర్మ స్టేచర్ ఏంటి...ఆయన చేసిన పని ఏంటి అంటూ నెటిజన్లు విరుచుకుపడ్డారు. ``ఢిల్లీలో 100 కోట్ల ఖరీదైన భవనంలో నివాసముంటున్న ఒక పేటీఎం పెద్దమనిషి.. భారత సాయుధ జవాన్ల సంక్షేమం కోసం రూ. 501 విరాళమిచ్చి తన పెద్ద మనసు చాటుకున్నారు`` అంటూ ఎద్దేవా చేశారు. మళ్లీ అదే తరహాలో ప్రకృతి విపత్తు ఉదంతంలో కూడా ఆయన నవ్వుల పాలవడం గమనార్హం.