తిరుమల పెద్ద జీయంగార్ స్వామి సీరియస్?

Update: 2020-07-23 10:30 GMT
తిరుమల ఆలయంలోని అర్చకుడైన పెద్ద జీయంగార్ స్వామి గత కొద్దిరోజులుగా కరోనా వైరస్ తో ఇబ్బంది పడుతున్నారు. లక్షణాలు తీవ్రమవడంతో తిరుమల ఆలయ అదికారులు ఆయనను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు.

ఇక అపోలోలో చికిత్స పొందుతున్న మరో అర్చకులు కాత్రిపతి నరసింహాచార్యులు కోలుకున్నారు. హోం క్వారంటైన్ లో ఉన్న మరో ముగ్గురు అర్చకుల ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగ్గా ఉందని టీటీడీ ప్రకటించింది.

తిరుమల, తిరుపతిలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ఎక్కడెక్కడి నుంచో భక్తులు స్వామి వారి దర్శనానికి వస్తుండడంతో వైరస్ వ్యాపిస్తోంది. తిరుపతిలో ఏకంగా 2వేలకు కేసులు చేరాయి.

ఇక తిరుమల శ్రీవారి ఆలయం పెద్ద జీయంగారికి కరోనా పాజిటివ్ గా తేలింది. స్విమ్స్ లో చికిత్సనందిస్తున్నా కోలుకోకపోవడంతో చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు.

పెద్ద జీయంగార్ ‘చాతుర్మాస దీక్ష’ తీసుకున్నారని తెలిసింది. పొలిమేరలు దాటవద్దనే నిబంధన ఉన్నా.. ఆయన ప్రాణాలకు కరోనాతో ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండడంతో వెంటనే చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు.
Tags:    

Similar News