హైకోర్టు తీర్పుతో ఇంటి నుంచి బయటకొచ్చిన పెద్దిరెడ్డి.. ఎయిర్ పోర్టుకు..

Update: 2021-02-07 09:30 GMT
రాష్ట్రపతి చిత్తూరు జిల్లా పర్యటనకు సరిగ్గా ఒక్కరోజు ముందు నిన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్.. ఏకంగా మంత్రి పెద్దిరెడ్డి దురుసు ప్రవర్తనపై యాక్షన్ తీసుకున్నారు. పంచాయతీ ఎన్నికలు ముగిసేవరకు  మంత్రి పెద్దిరెడ్డికి ‘గృహ నిర్బంధం’ విధించారు.

నిజానికి ప్రొటోకాల్ ప్రకారం సొంత జిల్లాకు వస్తున్న రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు పెద్దిరెడ్డి కూడా తిరుపతి విమానాశ్రయానికి వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలోనే నిమ్మగడ్డ విధించిన గృహనిర్బంధానికి వ్యతిరేకంగా మంత్రి పెద్దిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

ఈ క్రమంలోనే విచారణ జరిపిన హైకోర్టు మంత్రి పెద్దిరెడ్డి బయటకు రావడానికి అనుమతి ఇచ్చింది. రాష్ట్రపతి సహా వివిధ పర్యటనల్లో పాల్గొనవచ్చని.. నిమ్మగడ్డ ఆదేశాలను కొట్టివేసింది.

హైకోర్టు తీర్పు వెలువడగానే తన ఇంటి నుంచి బయటకొచ్చిన మంత్రి పెద్ది రెడ్డి రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అమరావతి నుంచి రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు వస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డికి మంత్రి పెద్దిరెడ్డి స్వయంగా స్వాగతం పలికారు. సీఎం జగన్, మంత్రి ఇద్దరూ కలిసి రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికేందుకు సిద్దమయ్యారు.
Tags:    

Similar News