ప్రత్యేక హోదా కావాలంటూ గుంటూరులో ఏసీ కాలేజీ ఆవరణలో తలపెట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ దీక్షకు చుక్కెదురయింది. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడి, ప్రజలు ఇబ్బంది పడతారని స్పష్టం చేస్తూ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అయితే అనుమతినివ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ వైసీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి జస్టిస్ శేషసాయి నివాసంలో వాదనలు కొనసాగాయి. వాదనలు విన్న హైకోర్టు హౌస్ మోషన్ పిటిషన్ ను తిరస్కరించింది. దీంతో శనివారం జరగాల్సిన జగన్ దీక్ష వాయిదాపడింది.
ఈ విషయమై... వైసీపీ నేత పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ జగన్ దీక్షను అడ్డుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు. జగన్ దీక్ష వల్ల చంద్రబాబు భయపడతున్నారని, అందుకే జగన్ చేపట్టబోయే దీక్షను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. జగన్ దీక్ష వల్ల ట్రాపిక్ జాంతోపాటు అనేక అనేక సమస్యలు వస్తాయనడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ దీక్షకు సంబంధించి చంద్రబాబు యక్ష ప్రశ్నలు వేస్తున్నారని మండిపడ్డారు. సాక్షాత్తు మీడియా ప్రతినిధులకే సీఎం ప్రశ్నలు వేశారని గుర్తు చేశారు. అలాంటప్పుడు చంద్రబాబు గతంలో ఢిల్లీలో - హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో దీక్ష ఎందుకు చేశారని ప్రశ్నించారు. దీక్ష అంటే ఆయనకు బాబు ఒక్కడికే తెలుసు అన్నట్లు మాట్లాడడం సరికాదని హితవు పలికారు. దీక్షను అడ్డుకోవడం దురదృష్టకరమని అయితే తమ దీక్షపై మరోమారు హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. వైసీపీ వర్గాల సమాచారం ప్రకారం ఈనెల 28న హైకోర్టులో రెగ్యులర్ పిటిషన్ వేసే యోచనలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది. రెగ్యులర్ ఫార్మాట్ లో వేసిన తీర్పుపై నిర్ణయం వెలువడిన తర్వాత దీక్షపై స్పష్టత రానుంది.