చైనా నిర్వాకం.. తగ్గుతున్న పురుషాంగం సైజు

Update: 2021-08-22 23:30 GMT
చైనా కాలుష్యం పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అది మానవ మనుగడకే ప్రమాదంగా తయారవుతోంది. పర్యావరణ వేత్తలు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచానికి కరోనా వైరస్ అంటించిన చైనా ఇప్పుడు మరో ఉపద్రవానికి కారణం అవుతుందని అంటున్నారు. చైనా చాపకింద నీరులా మరో అనర్థానికి కారణం అవుతోందని తేలింది.

చైనా వెదజల్లే కాలుష్యం వల్ల పురుషుల్లో అంగం పరిణామం క్రమంగా తగ్గిపోతున్నదట.. ప్రపంచంలోనే అత్యధికంగా కాలుష్యం వదలుతున్న చైనాదే ఈ పాపంలో ప్రధాన భాగమని చెబుతున్నారు.

చైనాలోని కెమికల్, ఫార్మా పరిశ్రమల నుంచి వ్యర్థ రసాయనాలను ఆ దేశం నేరుగా సముద్రంలోకి వదులుతోంది. దాంతో సముద్ర జలాల్లో కాలుష్యం పెరుగుతున్నది. దాంతో ప్రపంచ ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. ఈ అధిక కాలుష్యం , అధిక ఉష్ణోగ్రతల వల్ల మానవ శరీరంపై ప్రత్యక్ష ప్రభావం పెరిగిపోతున్నదని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు.

ఈ కాలుష్యం కారణంగా మానవ పురుషాంగం సైజు క్రమంగా తగ్గిపోతున్నదట.. ముందుకు కూడా వాతావరణంలో ఉష్ణోగ్రతలు ఇలాగే పెరిగితే జననేంద్రియాలు పూర్తిగా పనిచేయకపోయే ప్రమాదం కూడా ఉందట.. ముఖ్యంగా ప్లాస్టిక్ రేణువుల్లోని థాలెట్ అనే మూలకం వల్ల సంతానోత్పత్తి రేటు తగ్గిపోతుందని తేలింది. థాలేట్ జననేంద్రియాల అభివృద్ధికి నిరోధంగా మారుతుందని పేర్కొన్నారు.
Tags:    

Similar News