ఏపీ సీఎం వైయస్ జగన్ నిన్న ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు గల ప్రతి ఒక్కరికీ ఉచిత కోవిడ్ -19 వ్యాక్సిన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఒక రోజు తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా దీనిని అనుసరించారు. కొద్దిసేపటి క్రితం తెలంగాణ సీఎంఓ ఈ మేరకు ప్రకటించింది. తెలంగాణలో 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా టీకా అందిస్తున్నట్లు ప్రకటించింది.
కోవిడ్ -19కు పాజిటివ్ గా తేలడంతో ప్రస్తుతం సీఎం కేసీఆర్ ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నారు. బహుశా వచ్చే వారం కేసీఆర్ పరీక్షలు చేసుకొని ఆరోగ్య స్థితి ఆధారంగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలున్నాయి. తెలంగాణలో వ్యాక్సిన్ పంపిణీ, అందరికీ వేసే కార్యక్రమాన్ని తానే స్వయంగా పర్యవేక్షిస్తానని సీఎం కేసీఆర్ తెలిపారు. దీనికి చేయవలసిన ఏర్పాట్లపై చర్చించడానికి ఆరోగ్య మంత్రి, ఆ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు.
రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచిత కోవిడ్ -19 వ్యాక్సిన్ వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై 2500 కోట్ల రూపాయల భారం పడనుందని ప్రభుత్వం తెలిపింది. ఇది ప్రాథమిక అంచనా అని.. ప్రజల కోసం ఎంతైనా ఖర్చు భరించడానికి సిద్ధమని కేసీఆర్ ప్రకటించారు. టీకా రెండు మోతాదు కూడా ఇవ్వాల్సి ఉండడంతో ఈ ఖర్చు మరింత పెరుగనుంది. మొదటి టీకా మోతాదు లేదా రెండు మోతాదులను రెంటింటిని టీఆర్ఎస్ ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందా? లేదా అన్నది తెలియాల్సి ఉంది.
రాష్ట్రంలో రెమ్‌డెసివిర్ సరఫరాను ప్రభుత్వం వేగవంతం చేస్తుందని.. సరఫరా కొరత ఉంటే పరిష్కరించడానికి ఇప్పటికే తగిన చర్యలు తీసుకుంటున్నామని కేసీఆర్ హామీ ఇచ్చారు.