ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేసే ప్రజాప్రతినిధులు అధికారులు ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. తూతూమంత్రంగా చర్యలు చేపట్టి దులుపుకుంటున్నారు. అభాగ్యుల ఉసురు తీస్తున్నా రక్షణ చర్యలు కరువవుతున్నాయి.
కాలాలు ఏవైనా సరే.. సికింద్రా 'బాధ' మాత్రం పోవడం లేదు. ఇక్కడ నిర్లక్ష్యమో లేక ప్రమాదమో తెలియడం లేదు కానీ వరుసగా అగ్ని ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే సికింద్రబాద్ క్లబ్ మంటల్లో అప్పట్లో కాలిపోయింది. ఆ తర్వాత కూడా ఈ అగ్ని ప్రమాదాలు హైదరాబాద్ ను వీడడం లేదు.
ఏడాది కాలంలో సికింద్రాబాద్ పరిధిలో జరిగిన 4 అగ్ని ప్రమాదాల్లో 28 మంది మరణించారు. మార్చి 23న టింబర్ డిపోలో 11 మంది, సెప్టెంబరు 12న రూబీ లాడ్జిలో 8మంది , జనవరి 29న డెక్కన్ మాల్ లో ముగ్గురు, తాజాగా స్వప్నలోక్ లో ఆరుగురు చనిపోయారు.
భారీ అగ్ని ప్రమాదం బతుకు దెరువు కోసం ఆ కాంప్లెక్స్ లో పనిచేస్తున్న ఆరుగురు ప్రాణాలను తీసింది. నిండా పతికేళ్లు కూడా లేని వారి జీవితాలను అర్థాంతరంగా ముగించింది. పని కోసం పట్నం వెళ్లిన తన బిడ్డలు ఎప్పుడు వస్తారని ఎదురుచూసిన తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది.
స్వప్నలోక్ లో భారీ అగ్ని ప్రమాదంలో ఆరుగురిని పొట్టనపెట్టుకుంది. అతికష్టం మీద గ్రిల్స్ తొలగించి అయిదో అంతస్తులోకి వెళ్లిన అగ్ని మాపక శాఖ అధికారులు అపస్మారక స్థితిలో ఉన్న ఐదుగురిని బయటకు తీసుకొచ్చారు. వీరికి సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించారు. వీరు అప్పటికే మృతి చెందినట్టు గాంధీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. ఈ ఆరుగురికి కాలిన గాయాలు లేవు. ఊపిరితిత్తుల్లో పొగ చేరడంతోనే చనిపోయారని వైద్యులు తెలిపారు.
ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా జీహెచ్ఎంసీ కఠిన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. యజమానులు, అధికారుల నిర్లక్ష్యానికి సామాన్యులు బుగ్గికావాలా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.