కోవిడ్ తరువాత సినిమా పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. సినిమా బాగుంది అంటే తప్ప ప్రేక్షకుల థియేటర్లకు రాని పరిస్థితి. ఓ దశలో భారీ సినిమాలు తప్ప మినిమం గ్యారెంటీ సినిమాలు పెద్దగా బాక్సాఫీస్ వద్ద ప్రభావాన్ని చూపించలేకపోయాయి. బంగార్రాజు, డీజే టిల్లు, భీమ్లానాయక్, RRR, సర్కారు వారి పాట, మేజర్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాల్ని సాధించాయి. అయితే ఈ మూవీస్ తరువాత టాలీవుడ్ సక్సెస్ మాట వినడానికి చాలా టైమ్ తీసుకోవాల్సి వచ్చింది.
రెండు నెలలు టాలీవుడ్ క్షణ క్షణం భయం భయంగా గడిపింది. ఇక టాలీవుడ్ హిట్టు మాట వినడం కష్టమేనా.. ఓటీటీకి అలవాటు పడ్డ ప్రేక్షకులు ఇక థియేటర్లకు రావడం చూస్తామా? అని పలువరు మేకర్స్ భయాందోళనకు గురయ్యారు. అయితే సరిగ్గా రెండు నెలల తరువాత `బింబిసార`, సీతారామం` సూపర్ హిట్ లు గా నిలిచి ఇండస్ట్రీకి కొత్త ఊపరి పోశాయి. ఆ నమ్మకాన్ని `కార్తికేయ 2` మరింత పెంచడమే కాకుండా కథాబలమున్న సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని మరో సారి నిరూపించింది.
ఈ ఏడాది భారీ సినిమాలతో పాటు మినిమమ్ బడ్జెట్ సినిమాలు విడుదలయ్యాయి. భీమ్లానాయక్, RRR, సర్కారు వారి పాట, మేజర్ వంటి సినిమాలు భారీ వసూళ్లని రాబట్టాయి. కొన్ని వంద కోట్ల క్లబ్ లో చేరితే RRR వరల్డ్ వైడ్ గా రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి సంచలనం సృష్టించింది. ఇదిలా వుంటే ఈ ఏడాది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వచ్చిన రెండు సినిమాలు వంద కోట్ల క్లబ్ లో చేరడం విశేషం. టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఈ సంస్థ 2017లో కల్యాణ్ రామ్ నటించిన `MLA` మూవీతో నిర్మాణ రంగంలోకి ప్రవేశించింది.
గూడచారి, ఓ బేబి, రాజ రాజ చోరా, వెంకీ మామ, ఏ1 ఎక్స్ ప్రెస్ వంటి సినిమాలతో టాలీవుడ్ లో టాప్ ప్రొడక్షన్ కంపనీల సరసన చేరిపోయింది. అయితే 2022 సంవత్సరంలో పీపుల్ మీడియా నిర్మించిన `కార్తికేయ 2`, ధమాకా` సినిమాలని నిర్మించింది. ఈ రెండు సినిమాలు వంద కోట్ల క్లబ్ లో చేరడంతో విశేషం. బింబిసార, సీతారామం సినిమాలు టాలీవుడ్ కు కొత్త ఊపిరి పోస్తే పీపుల్ మీడియా నిర్మించిన `కార్తికేయ 2` పాన్ ఇండియా మూవీగా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఉత్తరాదిలో 30 కోట్లకు మించి వసూళ్లని రాబట్టిన ఈ మూవీ టోటల్ రన్ లో రూ. 120 కోట్లకు పైగా వసూళ్లని రాబట్టి వంద కోట్ల క్లబ్ లో చేరి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అనిపించుకోవడం విశేషం.
ఆగస్టులో `కార్తికేయ 2`తో వంద కోట్ల క్లబ్ లో చేరిన తొలి సినిమాని తమ ఖాతాలో వేసుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అదే ఏడాది వంద కోట్ల క్లబ్ లో చేరిన మరో సినిమాని సొంతం చేసుకుని వార్తల్లో నిలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ `ధమాకా`. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించిన మూవీ ఇది. ఇయర్ ఎండింగ్ లో 2022 డిసెంబర్ 23న విడుదలైన ఈ మూవీ టాక్ తో సంబంధం లేకుండా వంద కోట్ల క్లబ్ లో చేరి ఆశ్చర్యపరచడం విశేషం. ఇలా ఒకే ఏడాది పీపుల్ మీడియా డబుల్ ధమాకాని దక్కించుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం ఈ సంస్థ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో మారుతి రూపొందిస్తున్న మూవీని నిర్మిస్తోంది. అంతే కాకుండా గోపీచంద్ - శ్రీవాస్ లతో `రామబాణం`, పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ తో `వినోదాయ సితం` రీమేక్, నాగశౌర్యతో `ఫలానా అబ్బాయి పలానా అమ్మాయి`, లావణ్య త్రిపాఠితో ఓ సినిమా చేస్తూ వరుస క్రేజీ ప్రాజెక్ట్ లలో బిజీ బిజీగా గడిపేస్తుండటం విశేషం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.