ఇప్పటికి ఏడున్నర దశాబ్దాల క్రితం మత ప్రాతిపదికన అఖండ భారతం రెండు ముక్కలు అయింది. భారత్ లో ముస్లిం మైనారిటీలకు ఎలాంటి రక్షణ ఉండదని సందేహంతో పాకిస్తాన్ కోరారు. అలాగే వారు విడిపోయారు. ఆ తరువాత రెండు నెలలకే అప్పటికి ఒక సంస్థానంగా ఉన్న కాశ్మీర్ ని భారత్ లో కలవనీయకుండా పాక్ అక్రమంగా దండెత్తింది. అయితే భారత్ లో నాటి కాశ్మీర్ రాజు కలవడంతో భారత్ పాక్ తో తొలి యుద్ధం చేసింది. అలా కాశ్మీర్ ని భారత్ లో నిలబెట్టుకుంది.
కానీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ గా మూడవ వంతు భాగం పాకిస్థాన్ గుప్పిట్లో ఉండిపోయింది. భారత సైనికులు నాడు ఆ భూభాగాన్ని స్వాధీనం చేసుకునే కీలక దశలో నాటి ప్రధాని నెహ్రూ ఐక్య రాజ్యసమితికి ఈ విషయం మీద ఫిర్యాదు చేయడంతో మూడవ పక్షం జోక్యం పరోక్షంగా భారత్ ఆహ్వానించినట్లు అయింది. ఆ తరువాత యుద్ధ విరమణ ప్రకటన చేయాల్సి వచ్చింది.
దాంతో అలాగే పీఓకే ఉండిపోయింది. ఇక రెండవసారి మరో అవకాశం 1971 ప్రాంతంలో వచ్చింది. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా తూర్పు పాకిస్థాన్ కి మద్దతుగా పాకిస్థాన్ తో యుద్ధం చేసి లాహోర్ దాకా భారత్ సైనికులు వెళ్ళి పాక్ పీచమణించారు. ఆ సమయంలో సైతం పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని వెనక్కి తెచ్చి కలుపుకుందామన్న ఆలోచన చేయలేదు.
ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉగ్ర అడ్డగా చేసుకుని దశాబ్దాలుగా పాక్ చెలరేగిపోతున్నా భారత్ ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అయితే మోడీ సర్కార్ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక కాశ్మీర్ ని స్వయం ప్రతిపత్తిని లేకుండా చేస్తూ చట్టం చేశారు. ఆ తరువాత తరచూ కేంద్ర మంత్రులు అంటున్న మాట ఏంటి అంటే పీఓకేని తిరిగి స్వాధీనం చేసుకుంటామని.
అయితే భారత్ ఆ దిశగా ఎంతవరకూ ప్రయత్నాలు చేస్తుందో తెలియదు కానీ పీఓకేలోనే ఇపుడు అగ్గి రాజుకుంటోంది. ప్రస్తుతం పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో విలీనం చేయడానికి ఫుల్ సపోర్ట్ వస్తుంది. పీఓకేలోని గిల్గిట్ బాలిస్థాన్ ప్రజలు తమ ప్రాంతాలను భారత్ లో విలీనం చేయలని గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఇది ఒక ఉద్యమంగా సాగుతోంది. తమ ప్రాంతం పట్ల పాకిస్థాన్ ప్రభుత్వం వివక్ష చూపుతోంది అని వారు అంటున్నారు. అందువల్ల కార్గిల్ రోడ్దుని తెరచి భారత్ లోకి లఢక్ పరిధిలోని కార్గిల్ జిల్లాలో కలపాలని ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు. ఇది నిజంగా భారత్ పట్ల వారి విశ్వాసానికి రుజువుగానే చూడాలి. అదే సమయంలో పాకిస్థాన్ చేతకాని తనానికి కూడా నిదర్శనంగా భావించాలి.
ఏడున్నర పదుల పాక్ ఏలుబడిలో పీఓకేను ఎపుడూ ఒక ఉగ్ర స్థావరంగా చేసుకోవడానికే చూసింది తప్ప అక్కడ ప్రజలను పట్టించుకోలేదు అన్న ఆరోపణలు ఉన్నాయి. అంతే కాదు వారిని పాక్ పౌరులతో కాకుండా ఎపుడూ ద్వితీయ శ్రేణి పౌరులుగానే చూస్తూ వచ్చారు. ఈ రకమైన పక్షపాతం మీద వారు రగిలిపోతున్నారు. దాంతో ఇపుడు ఇపుడు మరోసారి గర్జిస్తున్నారు. ఈ నెల 6 నుంచి ఈ రకమైన ఆందోళనలు సాగుతున్నాయని అంటున్నారు. మరి దీని మీద పాక్ ఎలా రియాక్ట్ అవుతుందో, భారత్ వ్యూహమేంటో చూడాలి. ఏది ఏమైనా భారత్ సొంత ప్రాంతాలు తిరిగి కలుస్తామంటే అభ్యంతరం ఎవరికీ ఉండకూడదేమో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.