అంతర్జాతీయ వ్యాపార దిగ్గజం పెప్సికో జులుం తగ్గింది. భారతీయ రైతులు ఆ సంస్థ పొగరును అణిచారు. అన్నదాతల ఆక్రోశానికి వెల్లువలా వచ్చిన సోషల్ మీడియా మద్దతు తోడవడంతో...ఎంఎన్ సీ కంపెనీ తోకముడవక తప్పలేదు. పేటెంట్ పేరుతో సాగించిన ప్రహసనం విషయంతో తనంత తానుగా తోకముడిచింది. లేస్ చిప్స్ లో వాడే ఆలుగడ్డలను పండించినందుకంటూ గుజరాత్ రైతులపై వేసిన కేసు విషయంలో పెప్సికో తోక ముడిచింది.
వివరాల్లోకి వెళితే...గుజరాత్ లో నలుగురు రైతులు తమ బ్రాండెడ్ విత్తనాన్ని రైతులు పండించటం - ఉత్పత్తి చేయటం...డబ్ల్యూటీఓ నిబంధనలకు విరుద్ధం..అంటూ రూ.4.2కోట్లు నష్టపరిహారం చెల్లించాలంటూ పెప్సీకో కోర్టులో దావా వేసింది. విభిన్నమైన ఆలుతో (రిజిష్టర్డ్) తాము 'లేస్ చిప్స్' తయారుచేస్తున్నామని పెప్సీకో కంపెనీ పేర్కొంది. తమకు మేథోపరమైన హక్కులు కలిగిన విత్తనరకానికి చెందిన 'ఆలు'ను గుజరాత్ లోని నలుగురు రైతులు తయారు చేయటాన్ని పెప్పికో అహ్మదాబాద్ సివిల్ కోర్టులో సవాల్ చేసింది. తాము తయారుచేసిన భిన్న రకం ఆలు విత్తనాన్ని మిగతా రైతులు తయారు చేస్తున్నారని పెప్సీకో ఇండియా ఆరోపించింది. ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ - ఫార్మర్స్ రైట్స్(పీపీవీ - ఎఫ్ ఆర్) చట్టం - 2001లోని సెక్షన్ 64ను పేర్కొంటూ పెప్సీకో కోర్టును ఆశ్రయించింది. తమ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని కోర్టులో కంపెనీ వాదనలు వినిపించింది. 'బ్రాండెడ్ సీడ్'(విత్తనం) మరోకరు పండించడానికి వీల్లేదని కంపెనీ పేర్కొంది. ఓవైపు భారీ నష్టపరిహారంతో కూడిన కోర్టు కేసుతో రైతుల్ని బెదిరిస్తూనే - మరోవైపు కోర్టు బయట 'సెటిల్ మెంట్'ను రైతుల ముందుకు తెచ్చింది.
కాగా, పెప్సికో తీరుపై రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ తరఫున కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. నేషనల్ జీన్ ఫండ్ ద్వారా కోర్టులకయ్యే ఖర్చులను భరించాలని కోరారు.రైతులకు హక్కులపై అవగాహన ఉండదని భావించే ఇలాంటి కేసులు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మద్దతు దక్కింది. మరోవైపు పెప్సికో తీరుపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. లేస్ చిప్స్ - పెప్సికో ఆలుగడ్డ ఉత్పత్తులను నిషేధించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తమ తరఫున కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. దీంతో కంపెనీ వెనక్కు తగ్గింది. నలుగురు రైతులపై వేసిన కేసును ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు తెలిపింది.