అమ్మాయిలను ఆకర్షించేవి ఇవేనట..

Update: 2023-05-15 22:04 GMT
పర్ఫ్యూమ్స్‌.. మైమరిచిపోయే పరిమళాలు మెచ్చని వారు ఎవరుంటారు చెప్పండి. రాజుల కాలం నుండే ఈ పర్ఫ్యూమ్స్‌ వాడకంలో ఉన్నాయంటే ఇవి ఆకర్షణలో ఎంతటి కీలకపాత్ర పోషిస్తాయో తెలుస్తోంది. ప్రేయసిని ఆకర్షించే పర్ఫ్యూమ్స్‌కి ఏ దేశంలోనైనా డిమాండ్‌ ఎక్కువే. సువాసనకు అమ్మాయిలు ఆకర్షితువుతారని పలు అధ్యయనాలు కూడా చెప్పాయి. పర్ఫ్యూమ్స్‌ని వాళ్లు బాగా ఇష్టపడతారు కూడా. అయితే ఎలాంటి పరిమళాలు వాడడం వల్ల అమ్మాయిలు ఎక్కువగా ఆకర్షితులవుతారో ఇప్పుడు తెలుసుకుందాం.  

ఎంచుకున్న పర్ఫ్యూమ్స్‌ని బట్టి అబ్బాయిల మనస్సుని, వారి సామర్థ్యాన్ని అంచనా వేయొచ్చట. ఉదాహరణకు చాక్లెట్‌ ఫ్లేవర్‌ పర్ఫ్యూమ్స్‌. ఈ పరిమళం వాడే అబ్బాయిలను అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు. బేసిగ్గానే చాక్లెట్‌ ఫ్లేవర్‌ ఇష్టపడని అమ్మాయిలు ఉండరంటే అతిశయోక్తి కాదు. అదేవిధంగా డార్క్‌సెంట్‌ పర్ఫ్యూమ్స్‌. ఈ సువాసనకు అమ్మాయిలు ఆకర్షితులవడం ఖాయమట. ఈ రెండు పర్ఫ్యూమ్స్‌ అబ్బాయిల హుందాతనాన్ని తెలియజేస్తాయట.

మరో అద్భుతమైన పర్ఫ్యూమ్స్‌ ఫ్లవర్‌. పూల సువాసనతో కూడా పర్ఫ్యూమ్స్‌ వాడే అబ్బాయిలు నమ్మదగిన వ్యక్తులని అమ్మాయిలు అనుకుంటారట. వికసించే పువ్వులు ఎలాంటి తాజాదనాన్ని అయితే తెలియజేస్తాయో అబ్బాయిల మనస్సు అదే తాజాదనాన్ని కలిగి ఉటుందని అమ్మాయిల నమ్మకం. ఈ పర్ఫ్యూమ్స్‌లో లెక్కలేనన్నీ వెరైటీలు మార్కెట్లో ఉన్నాయి.  

ఆల్కాహాలిక్‌ పర్ఫ్యూమ్స్‌. మిగిలిన వాటితో పోలీస్తే ఇది కాస్త భిన్నమనే చెప్పొచ్చు. ఎక్కువగా శాతం అమ్మాయిలు ఈ వాసనని ఇష్టపడకపోయినా ఈ ఫ్లేవర్‌ నచ్చేవాళ్లు కూడా లేకపోలేదు. ఈ పర్ఫ్యూమ్స్‌ తమకు పిచ్చెక్కిస్తుందని కొందరు చెబుతారు. పైగా ఈ పర్ఫ్యూమ్స్‌ అబ్బాయిల ధైరాన్ని తెలియజేస్తుందట. అన్నట్టు.. ఈ పర్ఫ్యూమ్స్‌లలో అమ్మాయిలు పూర్తిగా ఇష్టపడని పర్ఫ్యూమ్‌ కూడా ఉందండోయ్‌. అదే ఫ్రూట్‌ పర్ఫ్యూమ్స్‌. పండ్లు తినడానికి తప్పా సువాసనకు పనికి రావని అమ్మాయిల అభిప్రాయమట. అందుకే ఫ్రూట్‌ పర్ఫ్యూమ్స్‌ని ఎవరూ ఇష్టపడరట. అయితే గ్రేప్‌ ఫ్రూట్‌ పర్ఫ్యూమ్స్‌కి మాత్రం కొద్దిగా డిమాండ్‌ ఉంది. మరెందుకు ఆలస్యం మీరూ మంచి పర్ఫ్యూమ్స్‌ని ఎంపిక చేసుకుని అమ్మాయిలను ఆకర్షించండి మరీ.

Similar News