శాశ్వత అధ్యక్షుడు : టీడీపీకి ఎవరో తెలుసా...?

Update: 2022-07-10 13:00 GMT
ఏ ప్రాంతీయ పార్టీ అయినా సర్వం సహా అధినాయకుడే ఉంటారు. ఈ విషయంలో ఎవరికీ ఏ రకమైన డౌట్లూ ఉండవు. ఒక నాయకుడు పార్టీ పెడితే ఆటోమేటిక్ గా సర్వ హక్కులు ఆయనకే వచ్చెస్తాయి. ఆయన తరువాత వారసులు కూడా సిద్ధంగా ఉంటారు. అలా వారి కుటుంబ ఆస్తిగానే పార్టీ ఉంటూ వస్తుంది.

ఈ మధ్యలో పార్టీ కోసం ఎంత మంది ఎన్ని రకాలుగా సేవ చేసినా వారికి మాత్రం ఈ ఆస్తిలో పిసరంత వాటా కూడా దక్కదు. దేశంలో ప్రాంతీయ పార్టీల తీరు చూసే ఇదే కనిపిస్తుంది. ఇక చూస్తే తెలుగు రాష్ట్రాలో నాలుగు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. తెలుగుదేశం వీటిలో చిరకాలంగా ఉన్నది. ఆ తరువాత తెలంగాణా రాష్ట్ర సమితి ఏర్పడింది.

ఇక వైసీపీ పదకొండేళ్ళ క్రితం వస్తే ఆ తరువాత జనసేనను సినీ నటుడు పవన్ కళ్యాణ్ పెట్టారు. ఇందులో మూడు పార్టీలు బలమైనవి. అధికారంలోకి కూడా వచ్చినవి. ఇందులో ఏ ప్రాంతీయ పార్టీ చేయని ఒక ప్రయోగాన్ని వైసీపీ చేసింది. తమ పార్టీకి ఏ బెంగా బెదురూ లేకుండా ఏకంగా జగన్ని శాశ్వత అధ్యక్షుడిని చేసుకుంది.

అంటే జగన్ జీవించినంత కాలం వైసీపీకి ఆయనే ప్రెసిడెంట్ అన్న మాట. ఆయన స్థానాన్ని కదపలేరు. ఆయన వద్దు అని రాజీనామా చేస్తే తప్ప వైసీపీకి కొత్త ప్రెసిడెంట్ ని చూడబోరు. దీని మీద విమర్శలు వస్తున్నా వైసీపీ నేతలు మాత్రం బాగనే సమర్ధించుకుంటున్నారు. మాకు జగనే నాయకుడు. ఆయన్నే ప్రెసిడెంట్ గా మేము ఎన్నుకుంటాం, దాన్ని శాశ్వతం చేసుకుంటే తప్పేంటి అన్నదే వారి వాదన.

ఇందులో తప్పులేకపోయినా ప్రజాస్వామిక స్పూర్తికి ఎపుడూ ఎన్నికలు సాక్ష్యంగా నిలుస్తాయి. మొక్కుబడిగా అయినా ఎన్నికలను నిర్వహించి మా అధ్యక్షుడు ఆయన అని చెప్పుకుంటే బాగుంటుంది. హుందాగా ఉంటుంది అని ప్రజాస్వామ్యప్రియులు అంటున్నారు. మిగిలిన పార్టీలలో కూడా అధ్యక్షుడు శాశ్వతమే కానీ వారు ఎన్నిక అన్న దానిని ముందు పెట్టి కధ లౌక్యంగా నడుపుతారు.

వైసీపీ ఆ ముసుగుని తొలగించేసింది అంటున్నారు. ఇలా ఒక ప్రాంతీయ పార్టీ చేయడానికి గట్స్ ఉండాలి. అలాగే పార్టీ నేత మీద అకుంఠితమైన ప్రేమ ఉండాలి. నూటికి నూరు శాతం ఆమోదం ఉంటే కచ్చితంగా శాశ్వత అధ్యక్షుడు అని ప్రకటించుకోవచ్చు.

మరి తెలుగుదేశం పార్టీకి ఈ ఆలోచన తట్టలేదా ఆ పార్టీ కూడా శాశ్వత అధ్యక్షుడిగా చంద్రబాబుని ఎందుకు ఎన్నుకోకూడదు అన్న చర్చ కూడా ఇపుడు ముందుకు వస్తోంది. అయితే తెలుగుదేశంలో చంద్రబాబు సర్వం సహా అయినా శాశ్వత అన్న మాట దగ్గర మాత్రం కొంత భిన్నాభిప్రాయాలు వస్తాయని అంటున్నారు.

చంద్రబాబు టీడీపీని ఎన్టీయార్ నుంచి తీసుకున్నారు. ఇక పాతికేళ్ళుగా ఆయన ప్రెసిడెంట్ గా ఉంటున్నారు. మరింతకాలం కూడా ఉంటారు. అయితే శాశ్వత అధ్యక్షుడు అని రాసుకుంటే మాత్రం టీడీపీలో బాలయ్య ఏనాటికైనా ప్రెసిడెంట్ అవుతారని భావించేవారు ఉన్నారు. అలాగే లోకేష్ కి మద్దతుగా ఉన్న వారు ఉన్నారు. ఇక వారూ వీరూ కాదు, జూనియర్ ఎన్టీయార్ కి టీడీపీ పగ్గాలు అప్పగించాలని కోరే వారు ఉన్నారు అని అంటున్నారు.

దాంతో టీడీపీ అధ్యక్ష పీఠం ఈ రోజు బాబు దగ్గర ఉన్నా రానున్న రోజులలో మాత్రం పోటీ ఉంటుందని అంటున్నారు. అందుకే శాశ్వత అధ్యక్షుడు అని బాబు ఏనాటికీ చెప్పుకోలేరని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అంటున్నారు. టీడీపీ బాబు సొత్తు కాదు, ఆయన మామ నుంచి లాక్కున్నది, అలాంటి పార్టీకి తానే శాశ్వతమని బాబు అంటే ఆ పార్టీలో ఎవరూ ఊరుకోరని నాని అంటున్నారు.

అయినా సరే బాబు మాటే ఈ రోజుకీ పార్టీలో ఫైనల్ గా ఉంటోంది కాబట్టి పెద్దాయన కనుక ముచ్చట పడితే తానే శాశ్వత ప్రెసిడెంట్ గా ఉంటాను అంటే మెజారిటీ ఆయన వైపే ఉండడం ఖాయమే. మరి వైసీపీని చూసిన తరువాత టీడీపీలో కూడా పర్మనెంట్ ప్రెసిడెంట్ వస్తారా. వెయిట్ అండ్ సీ.
Tags:    

Similar News