మళ్ళీ అమరావతి రాజధాని చుట్టూ రాజకీయం రాజుకుంటోంది. అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడం కోసం సీఆర్డీఏ చట్టంలో సవరణలకు ప్రభుత్వం పూనుకుంది. దాని మీద టీడీపీ నుంచి ఎదురు దాడి స్టార్ట్ అయింది. ఈ నేపధ్యంలో అమరావతిలో పేదలు ఉండకూడదా అని మాజీ మంత్రి పేర్ని నాని లాజిక్ పాయింట్ తీశారు. అందుకే మూడు రాజధానులు అని తాము అంటోందని కూడా చెప్పుకొస్తున్నారు.
అమరావతి రాజధానిలో పేదలు బడుగులు ఉండకూడదా. ఇదెక్కడి ఫ్యూడల్ మనస్థత్వమని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. అక్కడ గన్నవరం ఎయిర్ పోర్టులో భూములు పోయిన వారికి స్థలాలు ఇవ్వవచ్చా. హైదారాబాద్, చెన్నై, బెంగుళూరు ల ఉన్న వారికి అప్పనంగా ఎకరాలకు ఎకరాలు కట్టబెట్టొచ్చా. అదే పక్కనున్న గుంటూరు, క్రిష్ణా జిల్లాలలోని బీసీ ఎస్టీ, ఎస్టీ మైనారిటీలు, గూడు లేని నిరుపేదలకు ఇళ్ళు ఇస్తామంటే మాత్రం ఒప్పుకోరా అని పేర్ని నాని నిలదీశారు.
అమరావతిలో యాభై వేల మంది పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తామంటే కోర్టుకు పోయి మరీ అడ్డుకున్నది చంద్రబాబు మనుషులు కాదా అని ఆయన అంటున్నారు. సామాజిక సమతూల్యత దెబ్బతింటుంది అని మాట్లాడడం కంటే సిగ్గు చేటు వేరొకటి లేదని అన్నారు. అమరావతిలో అంతా డబ్బున్న వారు మీ మనుషులే ఉండాలా అని పేర్ని నాని ప్రశ్నించారు. రాజధాని అంటే అందరికీ అన్న భావన ఉండాలని. అలాంటిది పక్క జిల్లాల వారికే అక్కడ ఉండేందుకు చోటు లేకపోతే ఎలా మన రాజధాని ఇదీ అన్న భావన వస్తుందని ఆయన అంటున్నారు.
టీడీపీ దాని అనుకూల మీడియాకు జగన్ సర్కార్ ఏం చేసినా చెడ్డగానే ఉంటోందా అని నిలదీశారు. నాడు అమరావతి భూములు అమ్ముతామని నోటిఫికేషన్ చంద్రబాబు సర్కార్ జారీ చేస్తే ఇవే మీడియాలో ఎందుకు డిబేట్ పెట్టలేదు, ఇది తప్పు అని ఎందుకు రాయలేదు అని పేర్ని నాని అన్నారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి దానికి త్యాగం అనే కలరింగ్ ఇవ్వడం కొత్తగా చూస్తున్నామని అన్నారు. ఇక అమరావతి నిర్మాణం నుంచి స్థలాల కేటాయింపు చివరికి ఉద్యమం దాకా అంతా వ్యాపారం కోసమే చేస్తున్నారని అని మండి పడ్డారు.
ప్రశాంతంగా ఉన్న విశాఖ ఉత్తరాంధ్రా జిల్లాలలో మహా పాదయాత్ర పేరు చెప్పి రచ్చ చేయాలని చూస్తున్నారా అని ఆయన అంటున్నారు. ఏపీలో ఏదో జరిగిపోతోంది అన్న భ్రమలు కల్పించలని సమస్యలు క్రియేట్ చేయాలన్న తాపత్రయమే ఇందులో ఉందని ఆయన అంటున్నారు. అప్పులు జగన్ చేశారని అంటున్న టీడీపీ అనుకూల మీడియాకు చంద్రబాబు పదవీ కాలంలో ఒక్క మర్చి నెలలోనే 40 వేల కోట్లు అప్పు తెచ్చిన సంగతి గుర్తు లేదా అని నిలదీశారు.
అలాగే కాంట్రాక్టర్లకు 40 వేల కోట్ల రూపాయలు చెల్లించకుండా రైతులకు భీమా నష్టపరిహారం ఎగ్గొట్టి దిగిపోయిన నాటి సర్కార్ మీద ఒక్క మాట అయినా వ్యతిరేకంగా ఈ పత్రికలు రాసాయా అని పేర్ని ప్రశ్నించారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యేనాటికి ఖజానాలో వంద కోట్లు మాత్రమే ఉన్నాయని రాసిన వారు, మీకు అప్పులు ఇక పుట్టవని చెప్పిన టీడీపీ పెద్దలు ఇపుడు ఇన్నేసి అప్పులు చేస్తున్నారని నిందించడమేంటి అని నాని అంటున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్ వస్తే సహించలేకనే యనమల రామక్రిష్ణుడు కేంద్రానికి లేఖ రాశారని విమర్శించారు. 600 హామీలు ఇచ్చి ఏ ఒక్క దాన్ని అమలు చేయకుండా దిగిపోయిన చంద్రబాబు ముద్దుగా కనిపిస్తున్నారా అని ఆయన అనుకూల మీడియా మీద మండిపడ్డారు. సీపీఎస్ రద్దు విషయంలో చిత్తశుద్ధి ఉంది కాబట్టే సమస్య పరిష్కారానికి తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది అన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా కూడా మూడు రాజధానులు తమ విధానమని ఏదో నాటికి ఏర్పాటు చేసి తీరుతామని, అన్ని ప్రాంతాలు ఏపీలో అభివృద్ధి చెందాలన్నదే తమ అజెండా అని ఆయన స్పష్టం చేశారు. మొత్తానికి దుష్ట చతుష్టయం అంటూ నాని గట్టిగానే కౌంటర్లేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.