తెలంగాణ రాజ‌కీయాల‌పై ఏపీ మంత్రి మాట‌ల మంట‌లు!

Update: 2021-10-29 16:30 GMT
తెలంగాణ రాజ‌కీయాల‌పై ఏపీ మంత్రి, సీనియ‌ర్ నాయ‌కుడు.. పేర్ని నాని సంచ‌ల‌న కామెంట్లు చేశారు. ఇటీవ‌ల‌.. తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్‌.. ప్లీన‌రీ సంద‌ర్భంగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌.. ఏపీలో ప్ర‌జ‌లు కూడా త‌మ‌ను పిలుస్తున్నార‌ని..అక్క‌డ కూడా పార్టీ పెట్టాల‌ని ఆహ్వానిస్తున్నార‌ని.. ద‌ళిత బంధు వంటి ప‌థ‌కాలు.. అమ‌లు చేయాల‌ని అక్క‌డ కూడా కోరుతు న్నార‌ని.. వ్యాఖ్యానించారు. దీంతో అప్ప‌టి నుంచి ఏపీలోనూ టీఆర్ ఎస్ వ‌స్తుందా? అనే చ‌ర్చ సాగుతోంది. దీంతో ఈ విష‌యంపై వ‌రుస‌గా స్పందిస్తున్న ఏపీ మంత్రి పేర్ని.. తాజాగా కొన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌లో ఉన్న ప‌రిస్థితి ఏపీలో లేద‌న్నారు.

తెలంగాణాలో రాజకీయ శూన్యత వల్లే కొత్త పార్టీలు పుట్టుకు వస్తున్నాయని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు.  అందుకే ఓ ఐపీఎస్ అధికారి రాజీనామా చేసి మరీ పార్టీలోకి చేరారని.. మరికొన్ని పార్టీలు(ష‌ర్మిల వైఎస్సార్ టీపీ) కూడా వచ్చాయని అన్నా రు. ఏపీలో 151 స్థానాలు వచ్చిన తర్వాత శూన్యత ఎక్కడుందని..? మంత్రి ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజల గుండెల్లో ఎక్కడా శూన్యత లేదన్నారు. ప్ర‌జ‌లు త‌మ‌కే మొగ్గు చూపుతున్నార‌ని.. మంత్రి వ్యాఖ్యానించారు. అందుకే ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన అన్ని ఎన్నిక‌ల్లోనూ వైసీపీ ఘ‌న విజ‌యం ద‌క్కించుకుంద‌ని.. ఎక్క‌డా ఓడిపోలేద‌ని.. (ప‌రోక్షంగా దుబ్బాకలో కేసీఆర్ పార్టీ టీఆర్ ఎస్ ఓట‌మిని ప్ర‌స్తావించారు) అన్నారు.

మరోవైపు నదీ జలాల వినియోగం విషయంలో   సీఎం కేసీఆర్ మాట తప్పారని మంత్రి పేర్ని నాని అన్నారు. డిండి-పాలమూరు ప్రాజెక్టుల్లో తాగునీరు పేరుతో సాగుకు మళ్లించారని ఆయన ఆరోపించారు. ఏపీకి కేటాయించిన నీటిలో అదనంగా చెంచాడు నీళ్లు కూడా వినియోగించబోమని ఎప్పుడో చెప్పామని ఏపీ వాద‌న‌ను మంత్రి పేర్ని ఉద్ఘాటించారు. రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత విషయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ ఎంతదూరమో.. విజయవాడ నుంచి హైదరాబాద్ అంతే దూరమని గమనించాలన్నారు. రోజూ రాజకీయాల్లో ఉండాలనుకునే రేవంతి రెడ్డి వంటి వాళ్లు.. సంచలనాల కోసం ఏ అంశంపై అయినా ట్వీట్లు చేస్తారని సెటైర్ విసిరారు.

అయితే.. గ‌తంలో ఏపీ గురించి ఎప్పుడు కేసీఆర్ స్పందించినా.. ఏనాడూ.. మాట్లాడ‌ని.. ఏపీ ప్ర‌భుత్వం ఇప్పుడు దూకుడు పెంచ‌డంపై విశ్లేష‌కుల్లో చ‌ర్చ సాగుతోంది. ఇదేదో మార్పును సూచిస్తోంద‌ని అంటున్నారు.. నిజానికి కొన్నాళ్ల కింద‌ట వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ని కొంద‌రు మంత్రులు దూషించారు. అదేస‌మ‌యంలో.. సాగ‌ర్‌లో  తెలంగాణ ప్ర‌భుత్వం విద్యుత్ ఉత్ప‌త్తి చేప‌ట్టింది. అయిన‌ప్ప‌టికీ.. ఆయా సంద‌ర్భాల్లో స్పందించ‌ని.. ఏపీ స‌ర్కారు.. అనూహ్యంగా ఇప్పుడు ఏపీలో కేసీఆర్ పార్టీ పెట్ట‌మ‌ని అడుగుతున్నార‌న్న వ్యాఖ్య‌ల‌పై మాత్రం స్పందించ‌డం.. రోజూ.. ప్రెస్ మీట్లు పెట్ట‌డం.. వంటివి ఆస‌క్తిగా మారాయ‌ని అంటున్నారు. దీనివెనుక ఏదో వ్యూహం ఉంద‌ని గుస‌గుస వినిపిస్తోంది.
Tags:    

Similar News