కరోనా మహమ్మారితో స్కూళ్లని మూతపడ్డాయి. విద్యార్థులు ఇప్పుడు ఇంటివద్దే ఫోన్లు, ల్యాప్ ట్యాప్ ల్లో ఆన్ లైన్ తరగతులు వింటున్నారు. అయితే అర్థం అవుతుందో కాదో.. ఈ స్క్రీన్లు చూస్తూ బుర్రను హీట్ ఎక్కించుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఈ ఆన్ లైన్ తరగతులు నిలిపివేయాలంటూ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలైంది. వర్చువల్ తరగతులకు మార్గదర్శకాలు జారీ చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ నందకిశోర్ గర్గ్ అనే వ్యక్తి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరైన రక్షణలేని పరికరాలతో పిల్లలపై చెడు ప్రభావం పడే అవకాశముందని.. రక్షణ పద్ధతిలో ఆన్ లైన్ తరగతులు నిర్వహించేలా చూడాలని ఆయన పిటీషన్ లో సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
ఇక కేంద్రం మార్గదర్శకాలు ఇచ్చే వరకు ఆన్ లైన్ తరగతులు నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటీషన్ లో కోరారు.
కాగా కేంద్రం అన్ లాక్ 5.0లో ఈసారి స్కూల్లు, థియేటర్లు తెరుస్తుందని అందరూ ఆశిస్తున్నారు.ఈ మేరకు వార్తలు వస్తున్నాయి. దీంతో ఇక ఆన్ లైన్ తరగతుల జంఝాఠం విద్యార్థులకు తప్పే అవకాశం కనిపిస్తోంది.