పౌరసత్వం చట్టంపై పిటీషన్.. షాకిచ్చిన సుప్రీం

Update: 2019-12-16 08:18 GMT
దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు పెచ్చరిల్లుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో పోలీసుల కాల్పుల్లో ఐదుగురు మరణించారు. ఢిల్లీలో ఆందోళనలతో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. 50మంది విద్యార్థులను  పోలీసులు అరెస్ట్ చేశారు.  

ఈ పరిణామాలతో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్లను అత్యవసరంగా విచారించాలని పలువురు సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై సత్వర విచారణ కుదరదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి బెదిరింపులు పనికిరావని.. తాము హక్కులను నిర్ణయిస్తామని.. హింసాత్మక వాతావరణంలో కాదని.. హింసను ఆపితే సుమోటాగా తీసుకొని విచారణ జరుపుతామని చీఫ్ జస్టిస్ బాబ్డే వ్యాఖ్యానించారు. హక్కులు, శాంతి యుత ప్రదర్శనలకు సుప్రీం వ్యతిరేకందని ఆయన తెలిపారు.

ఇక ఢిల్లీలో ఆందోళన చేసిన విద్యార్థులు అరెస్ట్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై కూడా విచారణ చేపడుతామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

ఇక ఢిల్లీలోని జామియా వర్సిటీలో పోలీసుల దురాగతంపై విచారణకు ఆదేశించాలని ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. పోలీసులు అదుపులోకి తీసుకున్న 52 మంది విద్యార్థులు, లాఠీచార్జిలో గాయపడ్డ వారికి వైద్యసాయం, పరిహారం అందజేయాలని కోరారు.
Tags:    

Similar News