ఓవైపు వణికించే మహమ్మారి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లి.. తిరిగి వచ్చేసరికి ఏమవుతుందో తెలీని అనిశ్చితి. అలా అని ఇంట్లోనే ఉన్నా.. సేఫ్ గా ఉంటామన్న భరోసా లేని పరిస్థితి. ఇది సరిపోదన్నట్లుగా ఏళ్లకు ఏళ్లుగా ఉద్యోగాలు చేస్తున్నా.. అనుకోని విపత్తు విరుచుకుపడినంతనే జీతాల్లో కోతలు పెట్టే కంపెనీలు కొన్ని అయితే.. కొందరు ఉద్యోగులకు చెల్లుచీటి ఇచ్చే సంస్థలు మరికొన్ని. ఉద్యోగుల సంగతి ఇలా ఉంటే.. వ్యాపారుల పరిస్థితి మరింత దారుణంగా మారింది.
ఇక.. బడుగుజీవుల గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. ఇప్పుడొచ్చిన కష్టం నెలో.. రెండు నెలలో అయితే ఫర్లేదు. కానీ.. ఎప్పటికి ముగింపు అన్నది తెలీని దుస్థితి. ఇలాంటివేళ.. ప్రభుత్వాలు పగబట్టినట్లుగా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే సామాన్యుడి జీవితం ఏం కావాలి? తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇలానే ఉన్నాయి.
ప్రభుత్వాలకు ఆదాయం తగ్గిపోయిందన్న ఉద్దేశంతో పెట్రోల్.. డీజిల్ ధరల్ని రోజు వారీగా పెంచేస్తున్న తీరుతో సగటుజీవికి ఇప్పుడో కొత్త కష్టంగా మారింది. అంతర్జాతీయంగా పెట్రోల్.. డీజిల్ ధరలు నేల చూపులు చూస్తున్న వేళ.. అందుకు భిన్నంగా దేశంలో మాత్రం అంతకంతకూ పెరిగిపోతున్న పెట్రో ధరలు ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. పెట్రోల్.. డీజిల్ ధరల ప్రభావం మనిషి జీవితం మీద ప్రత్యక్షంగా.. పరోక్షంగా ప్రభావితం చేస్తుందన్నది మరచిపోకూడదు.
అవేమీ పరిగణలోకి తీసుకోని ప్రభుత్వం వరుసగా పదకొండో రోజున కూడా పెట్రోల్.. డీజిల్ ధరల్ని పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. లీటరు పెట్రోల్ మీద 55 పైసలు పెంచితే.. డీజిల్ మీద 60 పైసలు పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గడిచిన పదకొండు రోజుల్లో లీటరు పెట్రోల్ మీద రూ.6.02 పెరిగితే.. డీజిల్ మీద రూ.6.40 పెరిగింది. తాజాగా పెంచిన ధరలతో తెలంగాణలో లీటరు పెట్రోల్ ధర రూ.80.22 కాగా.. డీజిల్ రూ.74.07గా మారింది. ఏపీలో పెట్రోల్ ధర రూ.80.66కు చేరితే.. డీజిల్ రూ.74.54గా మారింది. రానున్న రోజుల్లోనూ పెట్రోల్.. డీజిల్ ధరల్ని పెంచటమే తప్పించి తగ్గించే యోచన లేనట్లుగా వ్యవహరిస్తున్నందుకు కేంద్రంలోని మోడీ సర్కారుకు దేశ ప్రజలంతా థ్యాంక్స్ చెబితే మంచిది. నమ్మి అధికారాన్ని కట్టబెట్టినందుకు ప్రజలు ఆ మాత్రం స్పందించకుంటే ఏం బాగుంటుంది చెప్పండి?