లక్షల కోట్ల ఆదాయం వస్తోంది. పెట్రోల్ - డీజిల్ పై పన్నులే కేంద్రానికి మెజార్టీ వాట.. రోజురోజుకు ముడిచమురు ధరలు పెరుగుతూ పోతుంటే చమురు సంస్థలు పెంచుకుంటూపోతున్నాయి. అయినా దున్నపోతు మీద వాన పడ్డట్టు కేంద్రంలో ఓ ఉలుకూ లేదు.. పలుకూ లేదు.. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు రోడ్డెక్కినా చలనం లేదు. జనాల్లోని జనాగ్రహం కాకలా తగిలిన వేళ.. ప్రధాని మోడీకి ఓ శుభ మధ్యాహ్నం పూట కలవరం మొదలైంది. కేంద్రంలోని ఆర్థిక - ఇంకొందరు మంత్రుల్ని పిలిచి పెట్రో ధరలపై సమీక్షించారు. పోనీలే జనాలపై మోడీకి కరుణ కలిగిందని అనుకున్నారు. ఆ కరుణ విలువ చూసి ఇప్పుడంతా రగిలిపోతున్నారు..
పెట్రోల్ ధరలపై సమీక్షించిన కేంద్ర ప్రభుత్వం చివరగా రెండు రూపాయల యాభై పైసలు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి తన సంపద కొంప కొల్లేరు అయినట్టే మొహం పెట్టి చెప్పేశాడు. గడిచిన నాలుగైదు నెలల్లో దాదాపు 15 రూపాయాలకు పైగా పెట్రోల్ ధరలు పెంచిన కేంద్రం ముష్టి రెండున్నర రూపాయలు తగ్గించి జనాలను పండుగ చేసుకోమంటోంది. అందునా ఓ మెలిక కూడా పెట్టారు. ఆ రెండున్నర రూపాయల్లో కేంద్రం తగ్గించేది అసలు రూపాయిన్నర మాత్రమేనట.. మిగతా రూపాయి.. చమురు సంస్థలు తగ్గిస్తాయట.. ఇంత బతుకు బతికీ జనాలకు కేంద్రం ఇచ్చింది రూపాయిన్నర బిచ్చమన్నమాట... దేశ ప్రజలపై బీజేపీ ప్రభుత్వానికున్న ‘ప్రేమ’ చూసి సాధారణ జనాలందరికీ కడుపులో తిప్పుతోందట.. ఇప్పుడందరూ అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పైగా 5 రూపాయలు తగ్గిద్దామని అనుకున్నామని.. కానీ పరిస్థితులు బాగా లేవంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సెలవిచ్చారు.‘‘ జనాల పరిస్థితే బాగాలేదు.. మీ ఖజనా నిండుగానే ఉంది. మీకు ఓట్లేసినందుకు మాకు తగిన శాస్త్రి జరిగిందంటూ సోషల్ మీడియాలో ఇప్పటికే దుమ్మెత్తిపోస్తున్నారు. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా కేంద్రం రెండున్నర రూపాయలు (నిజానికి రూపాయిన్నరే) తగ్గించడంపై ఇప్పుడు సోషల్ మీడియాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు.
2014కు ముందు చమురు ధరలు బ్యారెల్ కు 30 డాలర్లే ఉండేవి. ఇది చాలా తక్కువ. కానీ అప్పుడు పెట్రోల్ రేట్లు తగ్గించలేదు. పన్నుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాదేశాయి. ఇప్పుడు బ్యారెల్ చమురు 80 డాలర్లకు చేరువైంది. తక్కువున్నప్పుడు కొల్లగొట్టిన ప్రభుత్వాలు ఎక్కువున్న ప్రస్తుతం మాత్రం ఆ భారాన్ని జనాలపై మోపుతున్నాయి. ఇదెక్కడి అన్యాయం అని గొంతుచించుకున్నా ఎవ్వరూ స్పందించని పరిస్థితి నెలకొంది. డాలర్ తో రూపాయి మారకం విలువ కూడా ఈ దయనీయ పరిస్థితికి కారణమవుతోంది. అయినా రూపాయి విలువ పడిపోవడానికి నోట్ల రద్దు, జీఎస్టీ, అస్తవ్యస్త మోడీ ఆర్థిక విధానాలే కారణమనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు నిండా మునిగాకా జనాలకు చలి పెడుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి.. మన కర్మ అని ఊరుకోవడం తప్పితే.. పెట్రో భారంపై నోరుమెదపలేని స్థితి.