ఆ దేశాధ్యక్షుడు మనిషి రూపంలో కనిపిస్తాడు కానీ.. మనిషికి ఉండాల్సిన కనీస లక్షణాలు ఉండవు. క్రూరమైన ఆలోచనలకు నిలువెత్తు రూపం. దారుణమైన వ్యాఖ్యలతో దుర్మార్గంగా వ్యవహరించే అతడే.. ఫిలిప్ఫీన్స్ దేశాధ్యక్షుడు రోడ్రిగ్ డు టెర్టె. దారుణమైన ఆలోచనలతో మృగం కంటే నీచంగా వ్యవహరించే అతగాడు తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే వారి విషయంలో కర్కసంగా వ్యవహరించే అతగాడు.. తనపై తిరుగుబాటు చేసిన మహిళా రెబెల్స్ పై దారుణ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే తనకు వ్యతిరేకంగా ఉండే మహిళా రెబెల్స్ ను పెద్ద ఎత్తున అరెస్ట్ చేసి.. సిబ్బంది చేత దారుణంగా అత్యాచారాలు చేయిస్తాడన్న ఆరోపణలు రోడ్నిగ్ పైన ఉన్నాయి.
తాజాగా తనకు వ్యతిరేకంగా పోరాడుతున్న కమ్యూనిస్ట్ రెబెల్స్ పై మండిపడుతూ.. తమ సైన్యం రెబెల్స్ మహిళల మర్మాంగాల్లో కాలుస్తారని హెచ్చరించారు. మాటలే కాదు.. చేతల్లో ఆ పని చేయాలంటూ సైన్యానికి ఆదేశాలు జారీ చేయటం గమనార్హం.
ఇటీవల జరిగిన మాజీ తిరుగుబాటుదారుల సమావేశంలో దారుణ వ్యాఖ్యలు చేసిన రోడ్రిగ్.. రెబల్స్ ను తాము చంపమని.. కాకుంటే వారి మర్మాంగాల్లో కాల్పులు జరుపుతామని.. మర్మాంగాలు లేనప్పుడు బతికి ఉన్నా.. లేకున్నా ఒక్కటే అవుతుందన్నారు. తన మాటల్ని ఆదేశాలుగా మారుసతూ ఇప్పటికే ప్రభుత్వానికి ఆదేశాలు అందాయని.. త్వరలోనే ఈ ఆదేశాలు చట్టబద్ధంగా అమల్లోకి వస్తాయన్న రోడ్రిగ్ మాటలు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. తనను విమర్శించే వారిని.. తనకు వ్యతిరేకంగా పోరాడే వారి విషయంలో కొందరు దేశాధ్యక్షుడు ఎంత దారుణంగా వ్యవహరిస్తారన్న దానికి రోడ్రిగ్ ఒక ఉదాహరణగా చెప్పొచ్చు.