ఢిల్లీ నుంచి జ‌గ‌న్‌కు ఫోన్‌.. హుటాహుటిన ఢిల్లీకి?: ఏం జ‌రగ‌నుంది?

Update: 2021-03-02 13:30 GMT
వైసీపీ అధినేత‌, ఏపీ సీఎం జ‌గ‌న్‌.. బుధ‌వారం ఢిల్లీ వెళ్ల‌నున్నారా? ఆయ‌న‌కు ఢిల్లీ వ‌ర్గాల నుంచి ఫోన్ వ‌చ్చిందా? ఇప్పుడు ఇదే విష‌యం.. వైసీపీ నేత‌ల మ‌ధ్య హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ నేత‌ల మ‌ధ్య జ‌రుగుతున్న చ‌ర్చ‌ల సారాంశాన్ని బ‌ట్టి.. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం.. కేంద్రంలోని ఎన్‌డీఏ ప్ర‌భుత్వంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న బాస్ నుంచి సీఎం జ‌గ‌న్‌కు ఫోన్ వ‌చ్చింది. బుధ‌వారం మ‌ధ్యాహ్నంలోపు ఢిల్లీకి రావాల‌ని ఆయ‌న జ‌గ‌న్‌కు సూచించిన‌ట్టు స‌మాచారం. దీంతో వెంట‌నే స్పందించిన జ‌గ‌న్‌.. బుధ‌వారం నాటి త‌న షెడ్యూల్ కార్య‌క్ర‌మాల‌ను రీషెడ్యూల్ చేయాల‌ని త‌న కార్యాల‌య వ‌ర్గాల‌ను ఆదేశించిన‌ట్టు వైసీపీ నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు.

అయితే.. ఢిల్లీ నుంచి ఫోన్ అయితే.. వ‌చ్చింది కానీ.. ఎవ‌రు లైన్లోకి వ‌చ్చారు.. ఎవ‌రిని భేటీ అవుతారు? అనే విష‌యాలు మాత్రం తెలియ‌లేదు. కానీ.. పార్టీ వ‌ర్గాల నుంచి అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నుంచి ఫోన్ వ‌చ్చింద‌ని.. కొన్ని ముఖ్య‌మైన విష‌యాల‌పై ఆయ‌న సీఎం జ‌గ‌న్‌తో చ‌ర్చించేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని తెలుస్తోంది. ఈ విష‌యంలోనూ ఖ‌చ్చిత‌మైన అజెండా ఏంట‌నేది స్ప‌ష్టం కాలేదు. ఇక‌, దీనిపై సీఎంవో వ‌ర్గాలు స‌ర్వ‌సాధార‌ణంగా చెప్పే విష‌యాలనే మ‌రోసారి ఉటంకించే అవ‌కాశం ఉంది. సీఎం జ‌గ‌న్ ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా.. సీఎంవో మీడియాకు ఒక ప్ర‌క‌ట‌న చేస్తుంది.

ఢిల్లీ వ‌ర్గాల‌తో సీఎం జ‌గ‌న్ వీటిని చ‌ర్చించ‌నున్నారంటూ కొన్ని విష‌యాల‌ను పేర్కొంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు విశాఖ స్టీల్ ప్రైవేటీ క‌ర‌ణ‌, పోల‌వ‌రం నిధులు, ప్ర‌త్యేక హోదా, రెవెన్యూ లోటు భ‌ర్తీ, దిశ చ‌ట్టాన్నిఅనుమ‌తించ‌డం, ముడు రాజ‌ధానుల‌కు ఓకే చెప్ప ‌డం వంటి అంశాల‌నే ప్ర‌తిసారీ సీఎంవో విడుద‌ల చేసే ప్ర‌క‌ట‌న‌లో ఉంటున్నాయి. కానీ, ఈ సారి.. మాత్రం కొంత భిన్న‌మైన ప‌రిస్థితి నెల‌కొంది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో బీజేపీ నాయ‌కులు తీరిక లేకుండా ఉన్నారు. ఈ స‌మ‌యంలో సీఎం జ‌గ‌న్‌తో భేటీకి సిద్ధం కావ‌డం రాజ‌కీయ పండితుల‌కు కూడా ఆశ్చ‌ర్యంగానే ఉంది. ``అత్యంత ముఖ్య‌మైన విష‌యం కాక‌పోతే.. ఈ స‌మ‌యంలో జ‌గ‌న్‌ను పిలిచే అవ‌కాశం లేదు`` అని కొన్ని వ‌ర్గాలు తెలిపాయి.  

దీనిని బ‌ట్టి జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న పూర్తిగా రాజ‌కీయ కోణంలోనే ఉంటుంద‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. అదేస‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం లో చేరాల‌ని మ‌రోసారి ఎన్‌డీఏ పెద్ద‌లు కోరే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అదేస‌మయంలో జ‌గ‌న్ విజ్ఞ‌ప్తి మేర‌కు స్పెష‌ల్ స్టేట‌స్ కూడా ఇచ్చే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో భ‌విష్య‌త్తులో ఏం జ‌రుగుతుంద‌నేది ఆస‌క్తిగా మారింది. 
Tags:    

Similar News