షాక్: రేపిస్ట్ ఫొటో బదులు అధ్యక్షుడి ఫొటో

Update: 2021-04-08 08:55 GMT
పత్రికల్లో పొరపాటు జరిగితే తిరిగి వెనక్కి తీసుకోలేం. ఎందుకంటే ఆ కాపీలన్నీ ఊరు వాడ అంతా వ్యాపించిపోతాయి. అదే వెబ్ సైట్ డిజిటల్ మీడియాలో వెంటనే మార్చేయవచ్చు. ఈ కోవలోనే తాజాగా ఓ పత్రికలో దారుణమైన పొరపాటు జరిగింది. ఓ అత్యాచారం చేసిన నిందితుడి ఫొటో బదులుగా ఏకంగా ఓ దేశాధ్యక్షుడి ఫొటో ప్రచురించారు. ఈ పొరపాటు దుమారం రేపింది.

ముంబైకి చెందిన ఓ జాతీయ పత్రిక చేసిన పొరపాటు పెద్ద వివాదాస్పదమైంది. ముంబైలోని ఓ జాతీయ పత్రిక చేసిన ఈ ఘోర తప్పిదం ఫలితంగా ఏకంగా అత్యాచారం చేసిన నిందితుడి ఫొటోకు బదులుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఫొటో ప్రచురించారు.

ముంబైకి చెందిన 28 ఏళ్ల పాత్రకేయుడు వరుణ్ హిరేమఠ్ పై అత్యాచార ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుకు సంబంధించిన వార్తను ఓ నేషనల్ డైలీ న్యూస్ పేపర్ ఏప్రిల్ 6న ప్రచురించింది. అత్యాచారం నిందితుడు వరుణ్ ఫొటోకు బదులు ఏకంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫొటో ప్రచురించారు.

దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. సదురు పత్రికా యాజమాన్యం దీనిపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్లు వెల్లువెత్తాయి.

అత్యాచార కేసులో నిందితుడైన 28ఏళ్ల వరుణ్ హిరేమఠ్ కు ఢిల్లీ న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన వార్త ప్రచురణలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫొటో ప్రచురించి ఈ తప్పిదానికి పాల్పడ్డారు.
Tags:    

Similar News