దాదాపు పదమూడేళ్ల క్రితం.. ఇదే రోజున తెల్లవారగానే ఇంటికి వచ్చిన న్యూస్ పేపర్ లో ప్రముఖంగా పబ్లిష్ అయిన ఒక ుగ్రవాది ఫోటో భారతీయుల మనోఫలకంలో అలా నిలిచిపోయింది. ఏకే 47 రైఫిల్.. నల్ల టీషర్టు.. కార్గో ప్యాంటు ధరించి.. వీపు వెనుకాల ఒక బ్యాగ్ తో ఉన్న ఉగ్రవాది ఫోటో పబ్లిష్ అయ్యింది.
ఇదేదో ఒక పత్రిక కాదు.. రెండు పత్రికలు కావు. మొత్తం అన్ని పత్రికలు ఈ ఫోటోను క్యారీ చేశాయి. ఆ మాటకు వస్తే.. ఆ రోజున ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని మీడియా సంస్థలు ఈ ఫోటోను అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వాడేశాయి. అతడే.. నరహంతకుడైన ఉగ్రవాది అజ్మల్ కసబ్.
దేశ ఆర్థిక రాజధాని ముంబయిని టార్గెట్ చేసి.. పెను విధ్వంసాన్ని స్రష్టించటమే లక్ష్యంగా.. భారత్ ఇంతకు ముందెప్పుడూ చూడని సరికొత్త హింస ఆ రోజే పరిచయమైంది. ముంబయిలోని తాజ్ హోటల్.. నారీమన్ పాయింట్ వద్దనున్న ఒబెరాయ్ ట్రిడెంట్.. లియోపాల్డ్ కేఫే.. సీఎస్టీ.. కామా ఆసుపత్రుల వద్ద ఉగ్రవాదులు నరమేధాన్ని సృష్టించిన పెద్ద ఎత్తున ప్రాణాలు తీయటం ఇప్పటికి మర్చిపోలేనిది.
ఏ మాత్రం కనికరం లేకుండా.. నరమేధాన్ని సృష్టిస్తున్న ఉగ్రవాది ఫోటోను తీయటం అంత తేలికైన విషయం కాదు. ఓవైపు ఏం జరుగుతుందో తెలీని వేళ.. ఏ మాత్రం భయపడకుండా.. త్రోటుపాటుకు గురి కాకుండా కసబ్ ఫోటోను తీసి.. ప్రపంచానికి పరిచయం చేసిన ఫోటోగ్రాఫర్ సెబాస్టియస్ డిసౌజా.
ముంబై మిర్రర్ న్యూస్ పేప ఫోటో జర్నలిస్టుగా పని చేస్తున్నాడు. ఉగ్రవాదులు దాడులు తీస్తున్న వేళ.. ప్రాణాలకు తెగించి మరీ ఫోటోలు తీశాడు. ఇతడు తీసిన ఫోటో నే తర్వాతి రోజుల్లో విచారణకు కీలకంగా మారింది.
ఈ ఫోటో జర్నలిస్టు తీసిన ఈ ఫోటో ఒక్కటే కాదు.. గుజరాత్ అల్లర్ల వేళ.. ఒక వ్యక్తి.. కత్తి పట్టుకొని రౌద్రంతో ఊగిపోతున్న ఫోటోను తీశారు.ఈ ఫోటో ఆయనెంతో పాపులార్టీని సొంతం చేసుకున్నారు.
ఇలా.. అరుదైన సందర్భాల్లో ఆయన తీసిన ఫోటోలు హాట్ న్యూస్ గా మారాయి. చరిత్రలో నిలిచిపోయే అతి కొద్ది ఫోటోల్లో డిసౌజా తీసిన ఫోటోలు రెండు.. మూడు ఆ జాబితాలో ఉంటాయనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.