గోదావరి మహా పుష్కరాలు ముగిసాయి. పన్నెండు రోజుల పాటు సాగిన గోదావరి మహా పుష్కరాలు ఎంత వైభవంగా జరిగాయనటానికి స్నానం చేసిన భక్తుల సంఖ్యను చూస్తే ఇట్టే అర్థం అవుతుంది.
తెలంగాణలోని ఐదు జిల్లాలు.. ఏపీలోని రెండు జిల్లాల్లో నిర్వహించిన గోదావరి పుష్కరాలకు భక్తుల రద్దీ భారీగా ఉంది. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పోటాపోటీగా నిర్వహించిన పుష్కరాలు అనుకున్న దాని కన్నా అద్భుతంగా జరిగాయి.
గోదావరి పుష్కరాల తొలి రోజున రాజమండ్రిలో చోటు చేసుకున్న తొక్కిసలాట.. 27 మంది మృతి చెందిన తీరు ఎప్పటికి మాయని మచ్చలా ఏపీ సర్కారును వెంటాడటం ఖాయం. ఇదొక్క మచ్చ మినహా.. మిగిలినంతా సాఫీగానే జరిగిందని చెప్పాలి. కాకపోతే.. ఊహించిన దాని కంటే భారీగా భక్తులు పోటెత్తటంతో ట్రాఫిక్ జాంలతో తీవ్ర ఇక్కట్లు గురి కావటాన్ని మర్చిపోలేం.
రెండు ప్రభుత్వాలు చేసిన విస్తృతమైన ఏర్పాట్లు భక్తులకు సౌకర్యవంతంగా పుష్కర స్నానం చేసేందుకు అవకాశం కల్పించినా.. ఆ ఏర్పాట్లు సరిపోవన్న విషయాన్ని తాజా పుష్కరాలు చాటి చెప్పాయి. ఎందుకంటే.. రెండు ప్రభుత్వాలు ఏ మాత్రం ఊహించని రీతిలో భక్తుల సందడి నెలకొనటమే దీనికి నిదర్శనం. ఇక.. బయటకు పెద్దగా ఫోకస్ కాని మరో బాధాకరమైన అంశం ఏమిటంటే.. పుష్కరాల 12 రోజుల్లో రెండు రాష్ట్రాల్లోనూ రోడ్డు ప్రమాదాలు భారీగా సాగాయి. ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య కూడా తక్కువేం కాదు. ఇక.. ఒక మోస్తరు గాయాలు.. వాహనాల డ్యామేజీ ఉదంతాలు చెప్పలేనంత పెద్ద ఎత్తున సాగాయి. దీనికి కారణం.. పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తటంతో పాటు.. ప్రభుత్వాలు.. రహదారుల భద్రతపై పక్కాగా చర్యలు తీసుకోకపోవటం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు.
ప్రజా రవాణా విషయంలోనూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయనే చెప్పాలి. ప్రజలు పెద్దఎత్తున సొంత వాహనాలు.. అద్దె వాహనాల్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రజా రవాణాను ఎంపిక చేసుకున్న వారి కష్టాలు తెలియంది కాదు. ఏది ఏమైనా రెండు తెలుగు ప్రభ్వుత్వాలు ఊహించిన దాని కంటే భారీగా భక్తులు పోటెత్తటం కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. మొత్తంగా చూస్తే.. గోదావరి పుష్కరాల్ని ఘనంగా నిర్వహించాయని చెప్పొచ్చు.
ఇక.. గోదావరి పుష్కరాల్లో తెలంగాణ రాష్ట్రంలోనే భక్తులు పుష్కర స్నానం భారీగా ఆచరించటం ఒక విశేషం. ఆంధ్రా నుంచి కూడా భక్తులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి పుష్కర స్నానం చేయటం ఒక విశేషంగా చెప్పాలి. పన్నెండు రోజుల్లో తెలంగాణలో 6.4కోట్ల మంది పుష్కర స్నానం చేయగా.. ఏపీలోని రెండు జిల్లాల్లో 4.8 కోట్ల మంది స్నానాలు చేశారు. అంటే కాస్త అటూ ఇటూగా రోజు.. కోటి మంది వరకూ పుష్కర స్నానం చేసినట్లుగా చెప్పక తప్పదు.