రెండు విశేష‌మైన రైల్వేస్టేష‌న్లు: ‌వైర‌ల‌వుతున్న ఫొటోలు

Update: 2020-07-06 12:34 GMT
స‌రిహ‌ద్దులు వివాదాల‌కు కార‌ణ‌భూతాలుగా మారుతాయి. అదే కొన్ని ప్రాంతాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డేలా చేస్తాయి. ప్ర‌స్తుతం ఆ స‌రిహ‌ద్దులే భార‌త్‌, చైనా మ‌ధ్య వివాదం రేగ‌డానికి కార‌ణం. ఆ ముచ్చ‌ట ప‌క్క‌న పెడితే మ‌న దేశంలో రాష్ట్రాల మ‌ధ్య కూడా స‌రిహ‌ద్దులు ఉంటాయి. ఈ బార్డ‌ర్లు అప్పుడ‌ప్పుడు వివాదాస్ప‌ద‌మైనా.. వీటి గురించి తెలుసుకోవ‌డం మాత్రం ఆస‌క్తి చాలా ఉంటుంది. రెండు రాష్ట్రాల‌ను విడ‌దీసే స‌రిహ‌ద్దు వ‌ద్ద మనం ఉంటే అది ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అదే ఓయ్ సినిమాలో హీరో సిద్దార్థ హీరోయిన్‌కు ఇలాంటి స‌న్నివేశ‌మే చూపిస్తే ఆ హీరోయిన్ చాలా ఎగ్జాయిట్ మెంట్ అవుతుంది. తాజాగా అలాంటి ఎగ్జాయిట్ మెంటే కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇచ్చారు.

భారతదేశంలోని ఓ రైల్వే స్టేషన్‌కు సంబంధించిన విశిష్టతను కేంద్ర మంత్రి ట్విట‌ర్‌లో పంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా కొన్ని ఫొటోలు పెట్టి వాటి వివ‌రాలు తెల‌ప‌డంతో నెటిజ‌న్లు.. ఫాలోవ‌ర్స్ ఆస‌క్తిగా గ‌మ‌నించారు. ప్ర‌స్తుతం దానికి సంబంధించిన ట్వీట్లు వైర‌ల‌య్యాయి. రెండు రాష్ట్రాలకు కలిపి ఉన్న రెండు రైల్వే స్టేషన్‌ల ఫొటోలు పంచుకున్నారు. అందులో ఒక‌టి మహారాష్ట్ర సరిహద్దుల్లోని నందూర్బార్ జిల్లా నవాపూర్ రైల్వే స్టేషన్‌. ఇది గుజరాత్, మహారాష్ట్ర చెరో సగం పంచుకుంటున్న రైల్వే స్టేష‌న్‌. ఇది సూరత్‌-భుసావల్ మార్గంలో నవాపూర్ రైల్వే స్టేషన్. రెండు రాష్ట్రాల సరిహద్దులు ఈ స్టేషన్ మధ్య నుంచి వెళ్తున్నాయి. ఈ స్టేషన్ సగం గుజరాత్‌లో, సగం మహారాష్ట్రలో ఉంది.

ఇలాంటి స్టేష‌న్ మ‌రొక‌టి ఉంది. అది భవానీ మండి రైల్వే స్టేషన్. ఇది మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్‌లోకి విస్తరించి ఉంది. రెండు రాష్ట్రాల స‌రిహ‌ద్దుల్లో ఉందని కేంద్రమంత్రి తెలిపారు. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పోస్ట్‌కు లైకులు, షేర్లు చేస్తూ నెటిజన్స్ ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు.
Tags:    

Similar News