శత్రువును జయించడం కష్టం కావొచ్చు కానీ నిలువరించడం సులువు కావొచ్చు కొన్ని సార్లు.. ఆ విధంగా రాజకీయ శత్రువులను జయించే శక్తి ఇప్పుడు ఆమెకు అనగా సోనియాకు లేదు. కానీ తీవ్ర ఆలోచనల అమలు కారణంగా సోనియా ఓ విధంగా జగన్ పై నెగ్గారు. అదేవిధంగా త్వరలో కేసీఆర్ పై నెగ్గనున్నారు. ఓ విధంగా ఇదొక ఇంట్రస్టింగ్ అప్డేట్. పొలిటికల్ సర్కిల్స్ ను ఎంతో ప్రభావితం చేసే అప్డేట్.. ఎలా అంటే...?
చాలా రోజులకు అధినేత్రి సోనియా గాంధీ హుషారుగా కనిపిస్తున్నారు. పది జన్ పథ్ రోడ్ కు ఎన్నికలకు ముందే జన కళ ఒకటి వచ్చి ఉంది. జన కళ అనే కన్నా పూర్వ కళ అని రాయడంలో సహేతుకత ఉంది. అదే సబబు కూడా ! ఇప్పటిదాకా ఎన్నో తప్పుడు లేదా నిర్హేతుక నిర్ణయాలు వెలువరించి ఇబ్బందులు పాలయిన అధినేత్రి పార్టీనీ, పాలన సంబంధ వ్యవహారాలనూ తన దగ్గరే ఉంచుకోవాలని యోచిస్తున్నారు.
పార్టీ పగ్గాలు అందుకునే దిశగా రాహుల్ కానీ ప్రియాంక కానీ ఆలోచించే వీల్లేకుండా ఆమె నిర్ణయాలు ఉంటున్నాయి. ఇక ప్రశాంత్ కిశోర్ ఎంట్రీతో సీన్ మొత్తం రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటిలానే ఆయన ఇక్కడ తిష్ఠ వేసే అవకాశాలే ఎక్కువగా ఉంటే, సంబంధిత చర్యలు వేగంగా అమలుకు నోచుకుంటే ఓ విధంగా సోనియా గాంధీ ఆనందాలకు అవధే ఉండదు.. ఎందుకంటే ?
కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ బాగుండాలని సోనియా గాంధీ కలలు కంటున్నారు. వాటి సాకారం కోసం పరితపిస్తున్నారు. ప్రయత్నిస్తున్నారు కూడా ! ఎన్నడూ లేని విధంగా ఆమె పూర్తిగా కొత్త తరహా రాజకీయం ఒకటి అమలు చేస్తున్నారు. ఎనిమిదేళ్లు ఓ విధంగా తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ అన్నది లేకుండా పోయింది. మరో రెండేళ్లూ ఇలానే ఉండనుంది.
అంటే 2024 కు కూడా కాంగ్రెస్ బలం పుంజుకోవడం చాలా అంటే చాలా కష్టం. అస్సలు ఇలాంటివి ఊహించకూడదు కూడా ! ఈ దశలో శత్రువును నిలువరించే క్రమాన అటు జగన్ ను కానీ ఇటు కేసీఆర్ ను కానీ లేదా ఇతర ఉత్తరాది పార్టీల హవాను నియంత్రించే క్రమాన ప్రశాంత్ కిశోర్ అనే అస్త్రాన్ని తనకు అనుగుణంగా మలుచుకోనున్నారు.
అంటే ఆయన ఇకపై కాంగ్రెస్ కే పరిమితం కావాలన్న షరతుతో అసలు సిసలు కథ మొదలు కావడం ఖాయం. ఆ విధంగా ఆమె తన పంతం నెగ్గించుకోవడం సాధ్యం కానుంది.