ఏపీలో పీకే టీం ప‌ని మొద‌లెట్టేసింది..!

Update: 2021-10-01 02:30 GMT
దేశ రాజ‌కీయాల్లో గ‌త ఏడెనిమిది సంవ‌త్స‌రాలుగా పీకే అనే పేరు మార్మోగుతోంది. 2014 ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీకి కీల‌క స‌ల‌హాదారుగా ఉండ‌డంతో పాటు ఆయ‌న డిజిటిల్ టీంకు నేతృత్వం వ‌హించిన పీకే ఎన్నో స‌ల‌హాలు, సూచ‌న‌లు చేశారు. ఇవ‌న్నీ మోడీకి న‌చ్చ‌డంతో ఆయ‌న పీకేను బాగా న‌మ్మారు. 2014 ఎన్నిక‌ల‌లో మోడీ విజ‌యం త‌ర్వాత పీకేకు డిమాండ్ పెరిగింది. అక్క‌డ నుంచి పీకే ఒక్కో రాష్ట్రంలో ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డంతో పాటు స‌క్సెస్ అవుతూ వ‌స్తున్నారు.

ఢిల్లీలో కేజ్రీవాల్‌, బిహార్‌లో నితీష్ కుమార్‌, పంజాబ్‌లో కాంగ్రెస్ గెలుపులో పీకే వ్యూహాలు కీల‌క‌మ‌య్యాయి. క‌ట్ చేస్తే యూపీలో మాత్రం బీజేపీని ఓడించ‌డానికి మాయ‌వ‌తి + అఖిలేష్ కాంబినేష‌న్‌ను సెట్ చేసినా అక్క‌డ మాత్రం ఫెయిల్ అయ్యాడు. త‌ర్వాత ఏపీలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని అధికారంలోకి తీసుకు వ‌చ్చేందుకు యేడాది కాలంగా ప‌న్నిన వ్యూహాలు.. జ‌గ‌న్ ఏకంగా 151 సీట్ల‌తో అధికారంలోకి రావ‌డంతో పీకే మ‌రోసారి దేశ‌వ్యాప్తంగానే కాకుండా సౌత్ ఇండియాలో మ‌రింత పాపుల‌ర్ అయిపోయాడు.

ఇక బీజేపీ , మోడీతో శ‌తృత్వం పెరిగిన నేప‌థ్యంలో గ‌త ఎన్నిక‌ల‌లో బెంగాల్లో బీజేపీని ఓడించి.. మ‌మ‌త‌ను గెలిపించే క్ర‌మంలో పీకే మోడీ, బీజేపీ నేత‌ల‌కు బాగా టార్గెట్ అయిపోయాడు. బెంగాల్ ఎన్నిక‌ల‌లో బీజేపీ అప్ర‌తిహ‌త విజ‌యం సాధించ‌డంతో ఇప్పుడు పీకేకు బ‌డా బ‌డా రాజ‌కీయ నేత‌ల‌కే లేని డిమాండ్ ఏర్ప‌డింది. ఇక ఇప్పుడు పీకే ఏపీలో మ‌రోసారి జ‌గ‌న్ కోసం ప‌ని చేయ‌డం ఖ‌రారైంది. అటు తెలంగాణ‌లో ష‌ర్మిల పార్టీ కోసం కూడా పీకే ప‌ని చేస్తారంటూ వార్త‌లు వ‌స్తున్నాయి.

ఏపీలో పీకే ముందుగా వైజాగ్ నుంచి ప‌ని ప్రారంభించేసిన‌ట్టు తెలిసింది. మొత్తం 13 జిల్లాల‌లో పీకే టీం స‌ర్వేలు చేయ‌డంతో పాటు అధికార పార్టీలో ఎవ‌రు ఎలా ? ప‌ని చేస్తున్నార‌న్న దానిపై నివేదిక‌లు రెడీ చేయ‌నుంద‌ట‌. ఆయా జిల్లాల‌లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ప‌నితీరు ఎలా ? ఉంద‌న్న‌దానిపై స్ట‌డీ చేశాకే ఎవ‌రికి ఎలాంటి ప్రాధాన్య‌త ఇవ్వాలో డిసైడ్ చేస్తుంద‌ని అంటున్నారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో పీకే టీం అభ్య‌ర్థుల ఎంపిక‌లో మ‌రీ అంత జోక్యం చేసుకోలేదు. అయితే ఈ సారి పీకే టీం ఇన్వాల్‌మెంట్ ఎక్కువుగా ఉంటుంద‌ని వైసీపీ వాళ్లే చెపుతున్నారు.

ఇక ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల ప‌నితీరుతో పాటు జ‌గ‌న్ ప్ర‌భుత్వ పాల‌న ఎలా ? ఉంద‌న్న‌దానిపై సైతం స‌ర్వే చేయ‌నుంద‌ని తెలుస్తోంది. వ‌చ్చే సంక్రాంతి త‌ర్వాత వ‌రుస‌గా స‌ర్వేలు ఉంటాయ‌న్న వార్త‌ల‌తో వైసీపీ వాళ్లు ఎక్క‌డిక‌క్క‌డ అలెర్ట్ అవుతున్నారు.
Tags:    

Similar News