స్వచ్ఛ సర్వేక్షణ్ 2020 : ఫస్ట్ ప్లేస్ లో ఇండోర్..నాలుగో స్థానంలో విజయవాడ!
స్వచ్ఛ సర్వేక్షణ్-2020 జాబితాను కేంద్రం గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ఈ జాబితాలో మరోసారి మధ్యప్రదేశ్ లోని ఇండోర్ అగ్ర స్థానంలో నిలిచింది. మధ్యప్రదేశ్ లో ఇండోర్ నగరం వరుసగా నాలుగోసారి తోలి స్థానంలో నిలవడం విశేషం. రెండో స్థానంలో సూరత్, మూడో స్థానంలో ముంబై నిలిచాయి. ఇక మొదటి పది స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాలు కూడా చోటు దక్కించుకోవడం విశేషం.
ఏపీ నుండి ఎంపికైన మూడు నగరాల్లో .. నాలుగో స్థానంలో విజయవాడ, ఆరో స్థానంలో తిరుపతి, తొమ్మిదో స్థానంలో విశాఖపట్టణం నగరాలు నిలిచాయి. విర్చువల్ ప్రోగ్రామ్ ద్వారా కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ నిర్వహించిన స్వచ్ఛ మహోత్సవంలో మొత్తం 129 పట్టణాలు, రాష్ట్రాలకు అవార్డులను ప్రకటించారు. దేశంలోని మొత్తం 4,242 నగరాలు, పట్టణాలు, 62 కంటోన్మెంట్ బోర్డులు, 92 గంగా పరివాహక ప్రాంతాల్లోని పట్టణాల్లో ఈ సర్వే నిర్వహించారు. మొత్తం 28 రోజుల పాటు నిర్వహించిన ఈ సర్వేలో చాలా అంశాలను పరిగణనలోకి తీసుకుని వాటికీ ర్యాంకులను కేటాయించారు.
ఇకపోతే , ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను కేంద్రం 2016 నుంచి ప్రకటిసూ వస్తుంది. 2016 లో మైసూరు అగ్ర స్థానంలో నిలిచింది. ఈ సారి స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేను మొత్తం డిజిటల్ విధానంలోనే రికార్డు స్థాయిలో నిర్వహించారు. స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి తొలిసారి 2014 అక్టోబరు 2న ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ప్రారంభించారు.