కేశినేని ట్వీట్ల వెనుక అసలు ప్లాన్ ఇదే..

Update: 2019-07-18 07:59 GMT
నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడే నేర్పరి సుమతీ అన్నారు పెద్దలు. ఇప్పుడు ఇలానే కర్ర విరగకుండా పాము చచ్చే మహా ఉపాయాన్ని కేశినాని నాని అవలంభిస్తున్నారని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కేశినేని నాని వరుస ట్వీట్లు టీడీపీ శిబిరంలో గుబులు రేపుతున్నాయి. పార్టీలో ఉంటూనే చంద్రబాబును, పార్టీ నేతలను విమర్శిస్తున్న తీరును తెలుగు తమ్ముళ్లు జీర్నించుకోవడం లేదు. అయితే పార్టీ కష్టకాలంలో ఉన్న ఈ సమయంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని తీరు టీడీపీని కలవరపాటుకు గురిచేస్తోంది.

పార్లమెంట్ లో టీడీపీ పక్ష నేతలుగా గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడులను చంద్రబాబు నియమించడమే కేశినేని నాని అలకకు కారణమైంది. తనకంటే జూనియర్లను చంద్రబాబు అందలం ఎక్కించినందుకు ట్వీట్లలో పరోక్షంగా కడిగేశాడు. అప్పుడే కేశినేని నాని పార్టీ మారి బీజేపీలో చేరబోతున్నాడనే చర్చ సాగింది.నాని ట్వీట్లకు కౌంటర్ గా టీడీపీ నేతలు, బుద్దా వెంకన్న పరుష విమర్శలు చేయడంతో ఈ ఎపిసోడ్ టీడీపీలో పతాక స్థాయికి చేరింది.

అయితే కేశినేని నాని మాత్రం టీడీపీని వీడేందుకు ఇలా టీడీపీని, చంద్రబాబును తిడుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డైరెక్ట్ గా బీజేపీలో చేరితే అనర్హత వేటు పడుతుంది. అందుకే చంద్రబాబు, టీడీపీని తిడితే వాళ్లే సస్పెండ్ చేస్తే అప్పుడు తన ఎంపీ పదవికి ఎలాంటి అనర్హత రాదని కేశినేని ప్లాన్ చేసినట్టు రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. అందుకే చంద్రబాబు సస్పెండ్ చేసే దాకా ఇలా టీడీపీని తులనాడుతూ ట్వీట్స్ చేయాలని యోచిస్తున్నట్టు తెలిసింది.

కానీ ఈ రాజకీయం తెలిసిన చంద్రబాబు... కేశినేని నాని ట్వీట్లతో ఆవేశపడకుండా సస్పెన్షన్ చేయడం లేదు. ఇప్పుడు నాని బీజేపీలో చేరడానికి ఇదే ప్రతిబంధకంగా మారింది. అందుకే ట్విట్టర్ లో గొంతెత్తుతున్నాడు.


Tags:    

Similar News