చైనా పై వ్యుహ రచనలో భారత్: నేడు అఖిలపక్షంతో ప్రధాని సమావేశం

Update: 2020-06-19 06:12 GMT
సరిహద్దుల్లో చైనా ఆగడాలు హద్దుమీరుతున్నాయి. రెచ్చగొట్టేలా ఆ దేశం తీరు.. కవ్వింపు చర్యలకు పాల్పడడం వంటి వాటితో భొరత్ ను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ సమయంలోనే 20 మంది సైనికులను కోల్పోయాం. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహంగా ఉంది. గట్టి బదులు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే అన్ని పార్టీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. ప్రధాని అధ్యక్షతన నేడు అఖిలపక్ష సమావేశం కొనసాగనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ సమావేశం శుక్రవారం సాయంత్రం 5 గం.లకు జరగనుంది. ఈ సమావేశానికి దేశంలోని అన్ని పార్టీల అధ్యక్షులను పాల్గొనమని ఆహ్వానం అందించారు. చైనా పై ఏం చేద్దామని ప్రధాని అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోనున్నారు.

ఈ సమావేశంలో బీజేపీ తరపున జేపీ నడ్డా, కాంగ్రెస్ తరపున సోనియా గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ తరపున మమతా బెనర్జీ, శివసేన ఛీఫ్ ఉద్ధవ్, డీఎంకే అధినేత స్టాలిన్, అన్నాడీఎంకే తరపున సీఎం పళనిస్వామి, పన్నీర్ సెల్వన్, టీఆర్ఎస్ తరపున కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, జేడీయూ ఛీఫ్ నితీష్ కుమార్, సమాజ్ వాదీ నాయకుడు అఖిలేష్ యాదవ్, సీపీఐ తరపున రాజా, సీపీఎం తరపున సీతారాం ఏచూరి, , అకాళీదల్ తరపున సుఖ్‌బీర్ బాదల్, ఎల్‌జేపీ తరపున చిరాగ్ పాశ్వాన్, జేఎంఎం తరపున హేమంత్ సోరెన్ పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.
Tags:    

Similar News