ప్రధాని మోడీ అన్నకు తప్పిన ఘోర ప్రమాదం.. రోడ్డు వివరాలు కోరిన మోడీ ఆఫీస్
ప్రధాని నరేంద్ర మోడీ అన్నయ్య ప్రహ్లాద్ మోడీ పెను ప్రమాదం నుంచి బయట పడ్డారు. అయితే.. ఆయనకు ప్రాణాపాయం తప్పినా.. ఈ ప్రమాదం మాత్రం తీవ్ర గాయాల పాల్జేసింది. అంతేకాదు.. ఈయన మనవడి కాలు విరిగిపోయి.. తలకు కూడా తీవ్ర గాయమైంది. దీంతో ఈ కుటుంబం ఇప్పుడు ఆసుపత్రి పాలైంది. కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం మైసూరును సందర్శించేందుకు మోడీ అన్న ప్రహ్లాద్ మోడీ.. తన కుటుంబంతో ఇక్కడకు వచ్చారు.
అయితే.. మంగళవారం మధ్యాహ్నం మైసూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రహ్లాద్ మోడీ తీవ్రంగా గాయపడ్డారు. ప్రహ్లాద్ భార్య, కుమారుడు, కోడలు, మనవడితో కలిసి బండీపురా వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న మెర్సిడెస్ బెంజ్ కారు మధ్యాహ్నం 2 గంటల సమయంలో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. మైసూరుకు 13 కిలోమీటర్ల దూరంలో కడ్కోల వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు ఆయన కాన్వాయ్ వెంటే ఉంది. ప్రమాదంలో కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది.
ఈ ప్రమాదంలో ప్రహ్లాద్ మోడీ మనవడి కాలు ఫ్రాక్చర్ అయింది. తలకు కూడా గాయాలయ్యాయి. మిగతా వారు స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే వారందరినీ మైసూరులోని జేఎస్ ఆసుపత్రిలో చేర్చారు.
ధ్వంసమైన కారును బుల్డోజర్ సాయంతో అక్కడి నుంచి తరలించారు. కాగా, ఈ ఘటన జరిగిన విషయం తెలిసిన వెంటనే బీజేపీ కీలక నాయకులు, ప్రభుత్వ పెద్దలు మైసూరుకు చేరుకుని వైద్య సేవలను పర్యవేక్షించారు. ఇక, ఈ ఘటనపై మోడీ కార్యాలయం కూడా ఆరా తీసింది. దీనికి కారణం ఏంటి? సదరు రోడ్డు ఎలా ఉంది? డివైడర్ విస్తీర్ణం.. తదితర వివరాలను పీఎంవో సేకరించడం.. ఇప్పుడు ఆసక్తిగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.