ప్రధాని ఎయిర్ పోర్టులు కొత్తేం కాదు. ఆయన ఎన్నో ఎయిర్ పోర్ట్ లకు వెళ్లారు. ప్రధానమంత్రిగా రికార్డు స్థాయిలో విదేశీ పర్యటనలు చేసిన ట్రాక్ రికార్డు మోడీ సొంతం. పెద్ద ఎత్తున దేశాలకు వెళ్లి.. భారత దౌత్య విధానానికి నిదర్శనంగా తమ వాదనను వినిపిస్తున్న ఆయన పలు ఎయిర్ పోర్టులను చూసి ఉంటారు.
అయితే.. ఎక్కడా లేని విధంగా తన విదేశీ పర్యటనను ముగించుకొని వచ్చి.. కొచ్చి ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయిన వెంటనే.. ఆయనకు ఆ ఎయిర్ పోర్ట్ విపరీతంగా నచ్చేసింది. ప్రధానిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన వెళ్లిన తొలి విదేశీ పర్యటన ఇదే. ఇక.. ఆ విషయాన్ని పక్కన పెడితే.. కోచి ఎయిర్ పోర్ట్ కు మోడీ అంత ఫిదా అయ్యారెందుకన్నది చూస్తే.. ఆ ఎయిర్ పోర్ట్ మొత్తం సౌరశక్తితో నడవటం ఆయన్ను ఆకర్షించింది.
మొత్తం సౌరశక్తితో పని చేస్తున్న ఏకైక ఎయిర్ పోర్ట్ కొచ్చి మాత్రమే. ఈ నేపథ్యంలో ఆ ఎయిర్ పోర్ట్ పని తీరుకు ముగ్దుడైన ఆయన.. పలు స్టేడియంలకు కూడా సౌరశక్తి వినియోగించుకోవచ్చన్న సలహాను ఇచ్చారు. సౌరశక్తిని వినియోగించుకొని 'ఐరాస 2018 ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు’ ను సొంతం చేసుకున్న ఎయిర్ పోర్ట్ ఎంపీ కురియన్ ను మోడీ అభినందించారు. సౌరశక్తితో ఎయిర్ పోర్ట్ ను ఎలా డెవలప్ చేశారో అడిగి తెలుసుకున్నారు. టెక్నాలజీ పరంగా అప్డేటెడ్ గా ఉంటే మోడీ మనసును దోచుకోవటం అంటే మాటలు కాదని చెప్పాలి.