కునో నేషనల్ పార్క్ లోకి చీతాలను విడిచిపెట్టిన ప్రధాని మోడీ.. వీడియో

Update: 2022-09-17 08:30 GMT
కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న ఆఫ్రికన్ చీతాలు ఇప్పుడు భారత్ లోకి వచ్చేశాయి. నమీబియా నుంచి వాటిని మోసుకొచ్చిన స్పెషల్ కార్గో ఎయిర్ క్రాఫ్ట్.. కొద్దిసేపటి కిందటే గ్వాలియర్ ఎయిర్ పోర్స్ స్టేషన్ లో ల్యాండ్ అయ్యింది. వైమానిక దళానికి చెందిన స్పెషల్ ఫ్లైట్ ఇదీ.. మొత్తం ఎనిమిది చీతాలను నమీబియా నుంచి తీసుకొచ్చింది.

ఆఫ్రికాలోని నమీబియా దేశం నుంచి తీసుకొచ్చిన ఐదు ఆడ, మూడు మగ చీతాలను ప్రధానమంత్రి నరేంద్రమోడీ మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్, కునో నేషనల్ పార్క్ లోకి విడిచిపెట్టాడు.  క్వారంటైన్ ఎన్ క్లోజర్లలోకి అవి వెళ్లాయి.

దాదాపు 70 ఏళ్ల తర్వాత చీతాలు మళ్లీ భారతావనిపై నడిచాయి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ లా మారి.. వాటి ఫొటోలు తీయడం విశేషం.

నమీబియా లోని రాజధాని విండ్ హోక్ విమానాశ్రయం నుంచి జీ747 జంబో జెట్ విమానంలో నిన్నరాత్రి బయలు దేరిన ఎనిమిది చీతాలు గ్వాలియర్లోని ఎయర్ ఫోర్స్ స్టేషన్ కు ఇవాళ ఉదయం చేరుకున్నాయి. అక్కడ వాటికి కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా రిసీవ్ చేసుకున్నారు. హెలిక్యాప్టర్లలో ఆ ఎనిమిది చీతాలను మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ కు తరలించారు. ఆ చీతాల వయసు నాలుగు-ఆరేళ్ల మధ్య ఉంటుంది.

ప్రధాన మంత్రి నరేంద్రమోడీ కునో నేషనల్ పార్క్ కు చేరుకొని వాటిని ఎన్ క్లోజర్లలోకి విడిచిపెట్టారు. ఆ చీతాల జాతిని భారత్ లో పున: ప్రవేశపెట్టేందుకు కేంద్రప్రభుత్వం ‘ప్రాజెక్ట్ చీతా’ చేపట్టింది. ఈప్రాజెక్టును మొదట సుప్రీంకోర్టు నిలిపివేసినప్పటికీ 2020 జనవరిలో మళ్లీ ఆమోదముద్ర వేసింది. చీతాల సంరక్షణ విషయంలో ఈ ఏడాది జులై 20న నమీబియాతో భారత్ ఒప్పందంచేసుకుంది. దీంతో ఆ జీతాలు భారత్ కు చేరాయి.

మరోవైపు ఈరోజే ప్రధాని నరేంద్రమోడీ తన 72వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ ను చేపట్టారు. తన చేతుల మీదుగానే 8 చీతాలను స్వయంగా అభయారణ్యంలోకి విడిచిపెట్టారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Full View

Tags:    

Similar News