పాకిస్తాన్ జాక్ పాట్.. బయటపడ్డ బంగారు నిల్వలు..
ఇదిలా ఉంటే.. బంగారు నిల్వలను వెలికి తీసే ప్రక్రియను ప్రారంభించే అంశంపై తాము ఫోకస్ చేసినట్లుగా పంజాబ్ ప్రావిన్స్ గనుల శాఖ మంత్రి ఇబ్రహాం హసన్ మురాద్ ప్రకటించారు.
తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ జాక్ పాట్ కొట్టింది. ఈ దేశ ఆర్థిక ఇబ్బందులను కొంతలో కొంతైనా తగ్గించే శుభవార్త ఆదేశానికి అందింది. సుమారు రూ.18 వేల కోట్ల రూపాయలు విలువచేసే బంగారు నిల్వలను నదిలో గుర్తించారు.
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ఆటోక్ జిల్లాలో ఉన్న సింధూ నదిలోయలో భారీగా బంగారం నిల్వలను గుర్తించారు. దాదాపు 32.6 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయని, వీటి విలువ సుమారు రూ.18 వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. జియో లాజికల్ సర్వే ఆఫ్ పాకిస్తాన్ (జిఎస్పి) కూడా ఆ వివరాలను ధ్రువీకరించింది. ఈ వార్త ప్రస్తుతం పాకిస్థాన్‌లోని ప్రజలను ఆనందానికి గురి చేస్తోంది. పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది.
ఒకవైపు నిత్యావసర ధరలు పెరుగుదల, మరోవైపు ఇంధన ధరలు భారీగా పెరగడంతో ప్రజల జీవనం భారంగా మారింది. మరోవైపు వరుస ఉగ్రవాద దాడులతో ఎంతో మంది ప్రజలు, సైనికులు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా చేయూతను ఎవరు అందిస్తారా.? అని ఎదురుచూస్తున్న పాకిస్తాన్ కు బంగారు నిల్వలు లభ్యం కావడం ఈ ఇబ్బందులను కొంత వరకు తగ్గించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఒకరకంగా చెప్పాలంటే బంగారు నిల్వలు బయటపడ్డాయన్న వార్త భవిష్యత్తుపై పాకిస్తాన్ కు కొత్త ఆశలను రేకెత్తించినట్లు అయిందని చెబుతున్నారు. ఈ బంగారు నిల్వలు వెలికితీత ప్రక్రియ మొదలైతే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు కొత్త రెక్కలు తొడిగేందుకు ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ పై ఉన్న అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు బాటలు పడతాయని నిపుణులు పేర్కొంటున్నారు. పాకిస్తాన్ కరెన్సీ విలువ కొంతమేర బలోపేతం అవుతుందని చెబుతున్నారు. నిత్యవసర వస్తువుల ధరలు దిగొచ్చి సామాన్య ప్రజలకు ఊరట లభించే అవకాశం ఉంది.
తాజాగా బంగారు నిలువలు లభించాయన్న విషయాన్ని లాజికల్ సర్వే ఆఫ్ పాకిస్తాన్ ధ్రువీకరించింది. ఆటోక్ జిల్లాలోని సింధు నదిలో బంగార నిల్వలను వెలికి తీసే ప్రక్రియను ప్రారంభించడంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టామని పంజాబ్ ప్రావిన్స్ గనుల శాఖ మంత్రి ఇబ్రహీం హసన్ మురాద్ ప్రకటించారు. 32 కిలో మీటర్ల పరిధిలో బంగారం నిలువలు విస్తరించి ఉన్నాయని ఆయన వెల్లడించారు. పంజాబ్ ప్రావిన్స్ ఖైబర్ ఫంక్తూన్ ఖ్వా ప్రావిన్స్ పరిధిలోని పలు ఇతర ప్రాంతాల్లో కూడా బంగారం నిలువలను గుర్తించినట్లు వెల్లడించారు.
పెసావర్ బేసిన్, మర్ధాన్ బేసిన్లలో సైతం బంగారు నిలువలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ పై నిషేధం అమలవుతుందని ఇబ్రహీం హాసన్ తెలిపారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే బంగారు గనుల్లో మైనింగ్ జరుగుతుందని స్పష్టం చేశారు. సింధూ నది పాకిస్తాన్ మీదుగా ప్రవహించి హిమాలయాల్లోకి చేరుకుంటుంది. సింధూ నది హిమాలయాలు దిగున టెక్టోనిక్ ప్లేట్ల కదలికలు ఎక్కువగా ఉంటాయి. ఆ చర్యలు వల్లే అక్కడ బంగారం అణువులు ఏర్పడుతుంటాయి. అవి సింధు నది ప్రవాహం ద్వారా పాకిస్తాన్లోని నదీ పరివాహక ప్రాంతం పరిధిలో వ్యాప్తిస్తుంటాయి. వందల ఏళ్ల తరబడి నిరంతరాయంగా సింధు నది ప్రవాహం జరిగే ఫలితంగా ఈ బంగారం అణువులన్నీ నది లోయలో పలుచోట్ల పేరుకుపోయినట్లు తెలుస్తోంది. వీటిని వీలైనంత త్వరగా వెలికి తీసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ బంగారు నిల్వలు పాకిస్తాన్ ఆర్థిక అతిగాథలను మార్చేస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.