పాపాలు పోగొట్టుకునేందుకే కుంభమేళాకు వెళతారు.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఈ నెల 13 నుంచి 40 రోజులపాటు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరగనున్న కుంభమేళాపై కాంగ్రెస్ పార్టీ నేత ఉదిత్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-01-12 10:18 GMT

ఈ నెల 13 నుంచి 40 రోజులపాటు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరగనున్న కుంభమేళాపై కాంగ్రెస్ పార్టీ నేత ఉదిత్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుంభమేళాకు వెళ్లే వాళ్లంతా పాపాలు చేసిన వారే అన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు.

చేసిన పాపాలను పోగొట్టుకునేందుకే కుంభమేళాకు వెళుతుంటారని ఉదిత్ రాజ్ పేర్కొన్నారు. కుంభమేళాకు వెళ్లి కోరికలు కోరుకునే వారివి స్వార్థంతో కూడుకున్నవని పేర్కొన్నారు. పాపాలు కడుక్కునేందుకు హిందువులు కుంభమేళాకు వెళ్తారు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. సదరు కాంగ్రెస్ పార్టీ నేత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఆయన వ్యాఖ్యానించారంటూ పలువురు పేర్కొంటున్నారు. గతంలో ఎంఐఎం పార్టీకి చెందిన నేతలు ఇదే తరహాలో మాట్లాడారని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు అలా మాట్లాడడం ద్వారా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని హిందూ సంఘాలు, ధార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ కుంభమేళాకు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన హిందువులు సుమారు 40 కోట్ల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ జాబితాలో సినీ, వ్యాపార, క్రీడారంగానికి చెందిన ప్రముఖులు కూడా ఉంటారు. వీరంతా కుంభమేళాకు వెళ్లి స్నానాలు ఆచరించడం ద్వారా తమ వ్యక్తిని చాటుకుంటారు. ఇందుకోసం ఉత్తరప్రదేశ్ లోని యోగి సర్కారు భారీగా ఏర్పాటు చేసింది. కోట్లాది రూపాయల విచ్చించి మరి అనేక సౌకర్యాలను కల్పించింది.

తొలి స్నానం సోమవారం ప్రారంభం కావడం ద్వారా కుంభమేళా ప్రారంభమవుతుంది. కుంభమేళా ప్రారంభం కావడానికి కొద్దిగా గంటల ముందే ఈ తరహా వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నేత చేయడం ద్వారా వివాదం రేగుతోంది. ఈ తరహా వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీయడంతో పాటు మతపరమైన వివాదాలకు దారి తీసేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ పలువురు హిందువులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనోభావాలను గుర్తించి గౌరవించాల్సిన నాయకులు ఈ తరహా అసంబద్ధ వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేత ఉదిత్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై బిజెపి ఫైర్ అవుతోంది. హిందువులకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమన్న విషయం మరోసారి స్పష్టమైందని పేర్కొంది. కుంభమేళాపై అనవసరమైన వ్యాఖ్యలు చేయవద్దంటూ బిజెపి నాయకులు హితవు పలికారు. ఈ తరహా వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఏమి ఉద్దేశించి చేస్తుందో అర్థం కావడం లేదంటూ ధార్మిక సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు.

ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ వేదికగా జరగనున్న కుంభమేళాకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. కోట్లాది రూపాయలు వెచ్చించి సౌకర్యాలను కల్పించింది. కుంభమేళాకు వచ్చే భక్తుల కోసం తాత్కాలిక టెంట్లను ఏర్పాటు చేసింది. పటిష్ట నిఘాను ఏర్పాటు చేసింది. నీటిలో పనిచేసే డ్రోన్లను వినియోగిస్తోంది. వేలాదిమంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసింది. కొన్ని పదుల సంవత్సరాల తర్వాత ఒకసారి వచ్చే కుంభమేళా కావడంతో యోగి ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అనుగుణంగా ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ నేత ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.

Tags:    

Similar News