మోడీ ఇంటర్నెట్ స్టార్

Update: 2016-03-17 10:32 GMT
ఇంటర్ నెట్ లో అత్యంత ప్రభావోపేతమైన వ్యక్తిగా నరేంద్రమోడీ నిలిచారు. టైమ్సు  మ్యాగజైన్ సర్వేలో నరేంద్రమోడీ వరుసగా రెండో ఏడాది కూడా అంతర్జాలంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా నిలిచారు. సామాజిక మాధ్యమాన్ని అత్యంత ప్రతిభావంతంగా వినియోగించుకోవడంలో మోడీ ఎప్పుడూ ముందుంటారని న్యూయార్కు టైమ్సు పేర్కొంది. ఈ సందర్భంగా టైమ్సు మేగజైన్ ప్రధాని నరేంద్ర మోడీ తన పాకిస్థాన్ పర్యటన గురించి అసాధారణంగా తన ట్వట్టర్ లో పోస్టు చేసిన సంగతిని ప్రస్తావించింది. అంతర్జాలంలో ప్రభావ వంతమైన 30 మంది వ్యక్తుల జాబితాలో వరుసగా రెండో ఎడాది కూడా మోడీ నిలిచినట్లు టైమ్సు మేగజైన్ పేర్కొంది.
   
కాగా ప్రపంచంలో ప్రభావవంతమైన వ్యక్తుల జాబితా విడుదల చేసిన టైమ్స్ వారికి ర్యాంకులు మాత్రం ఇవ్వలేదు. ఈ జాబితాలో నరేంద్ర మోడీ తోపాటు అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ కూడా ఉన్నారు. బ్రిటన్ రచయిత్రి రౌలింగ్ తదితరులు ఉన్నారు. నరేంద్ర మోడీకి ట్విట్టర్ లో 18 మిలియన్ల మంది, ఫేస్ బుక్ లో 32 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారని టైమ్సు ప్రకటించింది
Tags:    

Similar News